నేనా? లెస్బియనా?: నీతూ
'గరమ్ మషాలా' చిత్రం తనకు లాంచింగ్ ప్యాడ్ అయితే, 'ట్రాఫిక్ సిగ్నల్' తో తనకు గుర్తింపు వచ్చిందనీ, 'ఓయే లక్కీ, లక్కీ ఓయే' చిత్రం తన కెరీర్ ను ముందుకు తీసుకువెళ్తే, '13 బి' చిత్రంతో తనకు మంచి ప్రశంసలు కూడా లభించాయని ఆమె చెప్పుకొచ్చింది. ఇప్పుడు వచ్చిన వివాదం వల్ల తనకు సొంత గుర్తింపు వచ్చినట్టయిందనీ, గ్రాడ్యుయేట్ స్థాయి నుంచి మరో స్థాయికి వెళ్లేందుకు ఇది ఉపకరిస్తుందనీ ఆమె ధీమా వ్యక్తం చేసింది. పలువురు తన నటనతో పాటు గ్లామర్ ను కూడా మెచ్చుకుంటారని పేర్కొంది.
తన సెక్సీ ఫిగర్ గురించి ముచ్చటిస్తూ పురుషులు ఏది ఇష్టపడతారో తనకు బాగా తెలుసునని చెప్పుకొచ్చింది. 'మగువలు సెక్సీగా ఉంటే పురుషుల చేతినిండా పనే. పురుషులు నా ఫోటోలు చూసి ఎంజాయ్ చేయాలని నేను కోరుకుంటాను. అదో తృప్తి' అంటూ నవ్వేసింది. ఇంత చెప్పిన తర్వాత కూడా నీతూతో ఎవరైనా ఏమని వాదించగలం చెప్పండి?!
Pages: -1- 2 News Posted: 10 June, 2009
|