అసెంబ్లీలో మారిన తీరు!
హైదరాబాద్: వాకౌట్లు లేవు.. నిరసనలు లేవు.. వాదోపవాదాలు అసలే లేవు. పోడియం వద్దకు వెళ్లి అరుపులు, కేకలు వేసే దృశ్యాలు మచ్చుకైనా కనిపించలేదు. ఆరోపణలు, ప్రత్యారోపణలు వినిపించనేలేదు. అవును.. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో జరిగినవే. అనేక వింతలు, విశేషాలను ఆవిష్కరించిన పదమూడవ శాసనసభ తొలి సమావేశాలు బుధవారంతో ముగిశాయి. తొలిసారిగా 147 మంది కొత్త సభ్యులు అడుగుపెట్టిన ఈ సభలో రెండు కొత్త పార్టీలు కూడాకాలుపెట్టాయి. ప్రధాన ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు తన పాత వైఖరి మార్చుకుని, పూర్తి సానుకూల దృక్ప థంతో వ్యవహరించగా, కొత్తగా వచ్చిన ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి కాలేజీలో అడుగుపెట్టిన విద్యార్ధిలా కనిపించారు.
ప్రధాన ప్రతిపక్ష సానుకూల వైఖరిని గమనించి, దానిని ముగ్గులోకి దింపే రాజకీయ వ్యూహం దిశగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించింది. పదమూడవ శాసనసభ సమావేశాల్లో అనేక వింతలు ఆవిష్కృతమయ్యాయి. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంలో ప్రతిపక్షాలు హుందాగా వ్యవహరించడం ఈ సమావేశాల ప్రత్యేకత. ముఖ్యంగా.. ప్రధాన ప్రతిపక్షమై తెలుగుదేశం పార్టీ ఎన్నడూ లేని విధంగా ఈసారి నిర్మాణా త్మకంగా వ్యవహరించింది. సాధారణంగా గవర్నర్ ప్రసం గానికి ధన్యవాదం తెలిపే చర్చలో సర్కారుపై విరుచుకు పడి, చివరకు సభ నుంచి వాకౌట్ చేసే అలవాటున్న తెలుగుదేశం పార్టీ, ఈసారి ఒక్కసారి కూడా వాకౌట్లు చేయకపోవడం విశేషం. అసలు ఈ సభలో ఏ పార్టీ కూడా వాకౌట్లు, నిరసనల జోలికి వెళ్లకపోవడం మరో విశేషం.
Pages: 1 -2- -3- News Posted: 10 June, 2009
|