అసెంబ్లీలో మారిన తీరు!
గతంలో కన్నా తక్కువ స్థానాలు వచ్చినప్పటికీ, మళ్లీ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వైఖరి, ఎత్తుగడ మారేదిలేదన్న విషయం చివరిరోజు ముఖ్యమంత్రి చేసిన ప్రసంగంతో స్పష్టమయిపోయింది. తొలి ఏడాది వరకూ ప్రభుత్వంపై విరుచుకుపడకుండా, సంయమనం పాటించ డం ద్వారా.. తాము నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరి స్తున్నామన్న సంకేతాలు ఇవ్వాలని నిర్ణయించిన తెలుగు దేశంపార్టీ వ్యూహాన్ని దెబ్బతీసేందుకు కాంగ్రెస్ ప్రయ త్నాలు ప్రారంభించినట్లు తొలి సభలో ఆ పార్టీ వ్యవహార శైలి వెల్లడించింది. టిడిపి, టిఆర్‌ఎస్‌పై ముఖ్యమంత్రి విరుచుకుపడటం ద్వారా, ప్రధాన ప్రతిపక్షాల సంయమ నం పాటించాలన్న లక్ష్యాన్ని దెబ్బతీసి, యుద్ధానికి పురికొల్పే వ్యూహానికి అధికారపక్షం తెరలేపింది. ప్రధాన ప్రతిపక్ష వ్రతభంగం చేసేలా అధికారపక్షం ఎత్తుగడ స్పష్ట మయింది. ప్రభుత్వానికి విమర్శనాత్మక సూచనలు, సల హాలు ఇచ్చిన ప్రతిపక్షాలపై ముఖ్యమంత్రి తీవ్రస్థాయిలో పాజిటివ్‌గా ముగుస్తాయనే ఆశించిన వారికి నిరాశే మిగిలింది.
ఇక ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ తన సహజ శైలికి భిన్నంగా ప్రతిపక్షపాత్ర పోషించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎప్పుడూ సీరియస్‌గా ఉండే పార్టీ నేత చంద్రబాబునాయుడు ఈసారి మొదటి నుంచి చివరి వరకూ చిరునవ్వులు చిందిస్తూ కనిపించడం, తన సహజ శైలికి విరుద్ధంగా సలహాపూర్వక సూచనలు చేయడం విస్మయపరిచింది. గత ఏడాదిలో గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించిన తెలుగుదేశం పార్టీ ఈసారి కనీసం నిరసన కూడా తెలపకపోవడం విశేషం. అయితే, స్పీకర్‌పై పోటీ అంశం మాత్రం ఆ పార్టీని అప్రతిష్ట పాలు చేసింది. ముందు పోటీకి పెడుతున్నట్లు సంకేతాలిచ్చి, ఆ తర్వాత పోటీ పెట్టకపోవడం పార్టీ నేతల్లోనే అసంతృప్తి రగిలించింది. చివరకు దానిపై పార్టీ సభ్యుడు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి బాబుకు లేఖాస్త్రం సంధించడం తెలిసిందే. చివరిరోజు ముఖ్యమంత్రి వ్యంగ్య వ్యాఖ్యలు, విమర్శలు చేసినా చంద్రబాబునాయుడు సంయమనం కోల్పోవకపోవడం అందరిదృష్టినీ ఆకర్షించింది.
Pages: -1- 2 -3- News Posted: 10 June, 2009
|