అసెంబ్లీలో మారిన తీరు!
కొత్త పార్టీ ప్రజారాజ్యం ఈ సభ ద్వారా తాను ప్రభు త్వానికి వ్యతిరేకం కాదన్న సంకేతాలు పంపింది. ఆ పార్టీ అధ్యక్షుడు చిరంజీవి మొదట సభలో చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకున్నా, ఆయన ప్రసంగాల్లో హుందాత నం లోపించినట్లు కనిపించింది. ఆయన ప్రసంగం సర దాగా సాగింది. ఈ సభలో ఆయన కాలేజీకి వచ్చిన కొత్త విద్యార్ధిలా కనిపించారు. అయితే, ఆయన సభలో వ్యవ హారాలను గమనించేందుకు ఆసక్తి కనబరిచారు. స్పీకర్ ఎన్నిక విషయంలో ఆర్ధికమంత్రి రోశయ్య చాతుర్యానికి చిరంజీవి చిత్తయిపోయి, పార్టీ సభ్యులతో చర్చించకుండా మద్దతు ప్రకటించడం చర్చనీయాంశమయింది. చివరి రోజున ప్రభుత్వానికఇనుకూలంగా చేసినప్రసంగం కూడా ఆపార్టీ కాంగ్రెస్‌కు దగ్గరవుతుందన్న సంకేతాలను మరింత బలపరిచాయన్న వ్యాఖ్యలు వినిపించాయి. మంచిపనులు చేసి పూర్తికాలం మీరే ముఖ్యమంత్రిగా ఉండాలని, అవస రమైతే తాము ప్రతిపక్షంలో కూర్చోవడానికయినా సిద్ధంగా ఉన్నామంటూ వైఎస్‌నుద్దేశించి చేసిన వ్యాఖ్యలు పరిశీ లిస్తే.. ఆ పార్టీ భవిష్యత్తులో అధికారపక్షంపై అనుసరించే వైఖరి ఏమిటన్నది స్పష్టమయింది.
ఇక స్పీకర్ కిరణ్‌కుమార్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తమ కొత్త బాధ్యతలను ఊహించినదానికంటే భిన్నంగా సక్రమంగా వ్యవహరించి అందరి మన్ననలు పొందారు. ప్రధాన ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు ప్రసంగిస్తున్న సమయంలో అవరోధం కల్పించే ప్రయత్నం చేసిన అధికారపక్షానికి, ముఖ్యమంత్రి మాట్లాడుతున్న సమయంలో అడ్డుతగిలిన ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా వారిద్దరూ కఠినంగా వ్యవహరించారు. చివరకు మంత్రుల మైక్ కూడా కట్ చేయడం ఆశ్చర్యపరిచింది. డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ గతంలో తనకున్న ప్యానల్ స్పీకర్ అనుభవంతో సభను చక్కగా నడిపించారు.
Pages: -1- -2- 3 News Posted: 10 June, 2009
|