మరోవైపు భారత్ పరిస్థితే ఆతిథ్య జట్టుకు ఉంది. వాళ్లకి కూడా ఇది డూ ఆర్ డై మ్యాచే. పాకిస్థాన్‌తో జరిగిన లీగ్‌లో అద్భుతంగా రాణించిన ఇంగ్లీష్ ఆటగాళ్లు దక్షిణాఫ్రికాతో మాత్రం చేతులేత్తెశారు. భారత్‌పై పుంజుకొని తిరిగి తమ సత్తా చాటుతామని ఇంగ్లాండ్ కెప్టెన్ కాలింగ్‌వుడ్ ఇప్పటికే ప్రకటించాడు. ఇరు జట్లకు కీలకం కావడంతో మ్యాచ్ రసవత్తరంగా జరగడం ఖాయం.
వెస్టిండీస్ చేతిలో ఓడినంత మాత్రానా తమను తక్కువ అంచనా వేయొద్దు. ఇంగ్లాండ్‌తో జరిగే మ్యాచ్‌లో మేమే గెలుస్తాం. కిందటి వరల్డ్‌కప్‌లో ఇటువంటి పరిస్థితినే ఎదుర్కొని టోర్నీలో నిలబడ్డం. ఇక్కడ కూడా దాన్ని పునరావృతం చేస్తాం. అప్పుడు యువరాజ్ బ్రాడ్ వేసిన ఒకే ఓవర్‌లో వరుసగా ఆరు సిక్సర్లు కొట్టాడు. అదే ఫీట్‌ను మళ్లీ సాధించే సత్తా అతనికుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధిస్తాం. దీనికి జట్టు ఆటగాళ్లంత సిద్ధంగా ఉన్నారు.