రక్తపు మరకలు ఎక్కడివి?
ఎమ్మెల్యేపై అత్యాచారం, హత్య కేసు నమోదు
ఈ సంఘటనలో ఎమ్మెల్యే రామారావుపై నిడదవోలు పోలీస్ స్టేషన్‌లో సిఆర్‌పిసి 376, 302 సెక్షన్ల కింద అత్యా చారం, హత్య కేసు నమోదైంది. ఘటనా స్థలంలో కేవలం రక్తపు మరకలు తప్ప ఏ మృతదేహం లేకపోవడంతో ఇదంతా ఒక పథకం ప్రకారం జరిగిందని ఎమ్మెల్యేతో పాటు టీడీపీ నేతలు ఆరోపించారు. దీని వెనుక కాంగ్రెస్ నాయకుల కుట్ర ఉందని వారు పేర్కొన్నారు. ఈ ఘటనపై డీజీపీ కార్యాలయం వెంటనే స్పందించింది. ఘటనపై వెంటనే నివేదక ఇవ్వాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఆదేశించారు. కాలేజీకి సమీపంలో ఓ కాలువ ఉన్నందున శవాన్ని అందులో పడేేస్తే మరోచోటుకు కొట్టుకుపోయే అవకాశం కూడా ఉందని వారు భావిస్తు న్నారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే పాత్రపై స్థానిక పోలీసులు పెదవి విప్పడంలేదు. ఆయనపై కేసు నమోదు చేసినప్పటికీ శవం దొరికిన తర్వాత కానీ ఏ విషయం చెప్పలేమని వారంటున్నారు.
అన్నీ అనుమానాలే
నిడదవోలు స్పృహ నర్సింగ్ కళాశాలలో విద్యార్థినిపై అత్యాచారం, హత్యోదంతం సంఘటన రకరకాల అనుమానాలకు తావిస్తోంది. శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్ జి. జయలక్ష్మి, జిల్లా ఎస్పీ బి. బాలకృష్ణ నర్సింగ్ కళాశాలను సందర్శించారు. అణుఅణువు పరిశీలించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌ను రప్పించారు. కాగా కొవ్వూరు ఎస్‌సి రిజర్వుడు స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఎన్నికైన ఎమ్మెల్యే రామారావుకు చెందిన నర్సింగ్ కళాశాలలో గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం సాయంత్రం వరకు రకరకాల పరిణామాలు సంభవించాయి.
Pages: -1- 2 -3- -4- News Posted: 19 June, 2009
|