రక్తపు మరకలు ఎక్కడివి?
కొవ్వూరు ఆర్‌డివో బి.కృష్ణ, కొవ్వూరు ఇన్‌ఛార్జి, నర్సాపురం డిఎస్పీ పి.వెంకటరామిరెడ్డి రాత్రి 9 గంటల సమయానికి నర్సింగ్ కళాశాల ప్రాంగణానికి చేరుకు న్నారు. జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం అందిం చారు. అయితే రాత్రి అధికారులు వచ్చే వరకు ప్రధాన గేటుకు తాళం వేసి, కాంపౌండ్‌లో కుక్కలను వదలడంతో పలు అనుమానాలు కలిగాయి. అంతలో నర్సింగ్ కళా శాల ప్రిన్సిపాల్ బయటకు వచ్చి హాస్టల్‌లో ఏ సంఘటన జరగలేదనిచెప్పి లోపలికి వెళ్ళిపోయారు. ఆ తరువాత విద్యార్థినులుండే హాలులో కరెంటు తీసివేయడంతో ఇంకా బయట వారిలో అనుమానాలు పెరిగాయి. ఎమ్మెల్యే కారు ఆవరణలో నిలిచి ఉంది.అది చూసి... ఎమ్మెల్యే లోపల ఉన్నారని, బయటకు రావాలని పెద్దఎత్తున ప్రజలు నినదిం చారు. చివరకు ఆర్‌డివో, డిఎస్పీ జోక్యంతో నర్సింగ్ కళాశాలలోకి మీడియాతో సహా ముఖ్య నాయకులు లోపలికి ప్రవేశించారు.
బాత్‌రూంలో గన్‌మేన్, మరో గదిలో డ్రైవర్
ఆర్‌డివో, డిఎస్పీ ఆధ్వర్యంలో అన్ని గదులు పరిశీలి స్తుండగా కింది భాగాన వెనుక వైపు ద్వారం వద్ద, తరగతి గదుల సమీపంలో రక్తపు మరకలు కనిపించడంతో అందరూ నివ్వెరపోయారు. గోడ పైన రక్తపు మరకలు కనిపించాయి. నేల మీద మనిషిని ఈడ్చుకెళ్ళిన ఛాయలు, రక్తం మరకలు కనిపించాయి. దీంతో మరింత అనుమా నంతో అక్కడ ఉన్న సిబ్బందిని ఎమ్మెల్యే రామారావు ఎక్కడ అని అధికారులు ప్రశ్నించగా ఆయన ఊరిలో లేరని సమా దానం చెప్పారు. ఒక గది తలుపు మూయడంతో మీడియా వారికి అనుమానం రాగా, దానిని పరిశీలించారు. అందులో ఇద్దరు విద్యార్థులు చదువుకుంటున్నారు. వారిని ఎసై్స ప్రశ్నించగా భయం వేసి తలుపు వేసుకున్నా మన్నారు. మరికొందరు బాత్‌రూం తలుపులు గట్టిగా కొట్ట డంతో అందులో ఎమ్మెల్యే గన్‌మేన్, మరొక గదిలో ఎమ్మెల్యే కారు డ్రైవర్ ప్రత్యక్షమయ్యారు. వారు కంగారు పడుతుండగా డిఎస్పీ వారిద్దరిని అదుపులోకి తీసుకోమని ఆదేశించారు.
Pages: -1- -2- 3 -4- News Posted: 19 June, 2009
|