రక్తపు మరకలు ఎక్కడివి?
ఎమ్మెల్యే రామారావు కూడా ఇక్కడే ఉంటా రని పిసిసి కార్యదర్శి బూరుగపల్లి చిన్నారావు, మరి కొందరు కాంగ్రెస్ నాయకులు, ప్రజారాజ్యం నాయకులు లోనికి ప్రవేశించి నాలుగు అంతస్థులు కలియతిరిగారు. చివరకు భవనం పైకి నిచ్చెన ద్వారా పైకి ఎక్కడంతో వాటర్ ట్యాంక్ ప్రక్కన ఎమ్మెల్యే రామారావు కనిపించడంతో ఆగ్రి హంచిన ప్రజలు ఆయనను తీవ్ర పదజాలంతో దూషిం చారు. ఎమ్మెల్యే రామారావు కూడా తిరిగి రాళ్ళు రువ్వారు. ప్రజలు మరింత రెచ్చిపోయి రాళ్ళు విసరడం, ఎమ్మెల్యేను పిడిగుద్దులు గుద్దడంతో పోలీసులు ఆయన్ని నిడదవోలు పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్ళారు. ఆయనపై కేసు నమోదు చేసి తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో సొంత పూచీకత్తుపై ఎమ్మెల్యేను విడుదల చేశారు.
కళాశాల రికార్డుల తనిఖీ
శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు జిల్లా కలెక్టర్, ఎస్పీ విద్యార్థులను విచారించి కళాశాల రికార్డులు తనిఖీ చేశారు. కొన్ని అవకతవకలు వెలుగుచూడడంతో విజయవాడలోని ఎన్‌టిఆర్ హెల్త్ యూనివర్సిటీ బృందం త్వరలో విచారణ జరుపుతుందని జిల్లా కలెక్టర్ జయలక్ష్మి మీడియాకు తెలిపారు. మొత్తం 16 మంది విద్యార్థినుల్లో 15 మందిని విచారించామని, మరొకరు సెలవు నుంచి ఇంకా రాలేదని కలెక్టర్ తెలిపారు. జిల్లా ఎస్పీ బి. బాలకృష్ణ మాట్లాడుతూ ఇక్కడ లేని విద్యార్థినితో ఫోన్‌లో మాట్లాడానని ఆమె క్షేమంగా ఉందని చెప్పారు. ఈ కళాశాలలో చదివే విద్యార్థులు 35 మంది లోపే ఉండగా, వారిలో 15 మంది మాత్రమే ప్రస్తుతం అక్కడ ఉండడం, మిగతా వారంతా సెలవులకు వెళ్లారని పోలీసులు నిర్ధ్దారణకు వచ్చారు.
Pages: -1- -2- -3- 4 News Posted: 19 June, 2009
|