బామ్మగారి భావాల్లోనే భారత్ భారతీయుల్లో అనైతిక భావాలను వ్యాప్తి చేస్తున్నది టెలివిజన్లేనని 79 శాతం మంది ముక్తకంఠంతో సెలవిచ్చారు. వివాహానికి ముందు శృంగారం భారతీయ సమాజానికి చాలా హానికలిగించేదిగా నగరాల్లో నివసించే 64 శాతంమందీ, పట్టణాల్లో నివసించే 82 శాతం మంది పురుషులు అభిప్రాయపడ్డారు. దేశంలో మానభంగాలు, అత్యాచారాలు జరగడానికి కారణం స్త్రీల వస్త్రాలంకరణలేనని 79 శాతం చెప్పారు. దీనిని పది శాతం మంది స్త్రీలు కూడా బలపరిచారు.
మహిళలే ఉత్తమ యజమానులుగా ఉండగలరని తేలింది. దీనిని అత్యధిక శాతం మగవాళ్ళు కూడా బలపరచడం విశేషం. ఇంగ్లీషు మాట్లాడడం వృత్తి రిత్యా విజయం సాధించడానికి చాలా అవసరమని ఎక్కువ మంది చెబితే ఇంగ్లీషు మాట్లాడేవారు స్వార్థపరులని చాలా తక్కువమంది చెప్పారు. తమ పిల్లలు కంప్యూటర్లలో ఇంటర్నెట్ ను వాడడంపై, ముఖ్యంగా ఆర్కుట్, ఫేస్ బుక్, ట్విట్టర్ సైట్లను చూడడం పట్ల వారు ఎక్కువగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పాశ్చాత్య ధోరణులకు సంబంధించి దక్షిణాది వారి కంటే ఉత్తరాది వారు కాస్త ఉదారమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కానీ, మిగతా చాలా అంశాలలో ఉత్తరదక్షిణ ప్రజల అభిప్రాయాలు ఒక్కలానే ఉండటం విశేషం. పిల్లల దుస్తుల అంశాన్నే తీసుకుంటే పిల్లలకు ఏది నచ్చితే అది వేసుకోవచ్చని ఉత్తరాదిలో 70 శాతం వారు చెబితే దక్షిణాదిలో వీరి శాతం 54 గా ఉంది. మహిళలు జీన్స్ లాంటి పాశ్యాత్య వస్త్రధారణను ఉత్తరాదిలో 52 శాతం మంది ఆమోదిస్తే దక్షిణాదిలో 70 శాతం వ్యతిరేకించారు. స్వలింగ సంపర్కం ఒక వ్యాధని ప్రతీ ముగ్గురు భారతీయుల్లో ఇద్దరు భావిస్తున్నారు. ఉన్న ఒక్కరూ దానిని నయం చేసుకోవాలని సూచిస్తున్నారు.
Pages: -1- 2 -3- News Posted: 13 August, 2009
|