బామ్మగారి భావాల్లోనే భారత్ సమాజం మార్పునకు లోనవుతున్నప్పుడు ప్రజల భావజాలాల్లో ఇలాంటి ద్వైతీభావం సహజమని, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజుల్లో కూడా ఇలాంటి ధోరణులు కనిపించాయని సామాజిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ గీతా చద్దా వివరించారు. ప్రపంచీకరణ, కార్పోరేట్ ఆర్ధిక సమాజం అభివృద్ధి జరుగుతున్న ఈ కాలంలో సంస్కరణల సంధికాలం అనివార్యమని ఆమె చేప్పారు. మనల్ని మనం ఆధునీకరించుకోవడం అవసరం, ఆ సమయంలో గతంలో నీతి అనుకున్నది పోతూ ఉంటుందని, నైతికతను కొల్పోవడం, గుర్తింపును పోగొట్టుకోవడం విశ్వవ్యాప్త పరిణామాల్లో భాగమని చద్దా విశదీకరించారు.
ఉదాహరణకు బీహర్ లోని పూర్నియా గ్రామీణ ప్రాంతాన్నే తీసుకుంటే అక్కడ వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్న 19 లక్షల మందికి టీవీ,సినిమాలే ప్రపంచాన్ని చూపెడుతున్నాయి. అత్యధికులకు కేవలం టీవీయే ఆధునిక ప్రపంచాన్ని వారికి చేరువగా చూపిస్తున్న ఏకైక గవాక్షమని ఆమె వివరించారు. టీవీల్లో వచ్చే రియాలిటీ షోలు వారిని విశేషంగా ఆకర్షిస్తున్నాయని, దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయని తెలిపారు. ఈ షోలలో కొన్నిదృశ్యాలను సెన్సార్ చేయాల్సిన అవసరం ఉన్నా, ఇక్కడ ప్రజలు ఎంత వెనుకబడి ఉన్నారో వారికి ఈ షోలు తెలియచేస్తున్నాయని పేర్కొన్నారు. కాలేజీల్లో చదువుతున్న పిల్లలు తమ ఆహార్యాన్ని మార్చుకోవాలని భావిస్తున్నారు. ఈ షోల్లో పాల్గొని సెలబ్రిటీలు అయిపోవాలని, డబ్బులు సంపాయించాలని కలలు కంటున్నారని చద్దా చెప్పారు. కాని పూర్నియాకు చెందిన రచయిత, చరిత్రకారుడు డాక్టర్ ఆర్. ప్రసాద్(75) మాటల్లో అయితే యువత వాస్తవాన్ని మరచిపోతోందని అభిప్రాయపడ్డారు. ఎవరో నూటికో కోటికో ఒక్కరు రియాల్టీ షోతో వెలుగుతారని, కలల వెంట పరుగులు తీస్తారని కానీ, వారికి పంటలు పండించడం అంటే ఏమిటో తెలియదని, వాళ్ల మనస్సులు కలుషితమైపోతున్నాయని ఆయన చెప్పారు.
Pages: -1- -2- 3 News Posted: 13 August, 2009
|