'స్వైన్ ఫ్లూ'తో 25 కోట్ల నష్టం
ముంబైలో థేయటర్లు మూతపడటం వల్ల వచ్చే నష్టం మాటెలా ఉన్నా ప్రజారోగ్యం అనేది చాలా ముఖ్యమనీ, 'స్వైన్ ఫ్లూ' వైరస్ శీఘ్రుగతిన అదుపులోనికి వస్తుందని తాము ఆశిస్తున్నామనీ, దేశవ్యాప్తంగా తమకున్న మల్టీప్లెక్స్ లలో అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామనీ ఐనాక్ లీజర్ సిఇవో అలోక్ టాండన్ వ్యాఖ్యానించారు. ఏంజెల్ బ్రోకింగ్ కు చెందిన విశ్లేషకుడు ఆనంద్ షా మాట్లాడుతూ, బాలీవుడ్ కొత్త రిలీజ్ లకు వచ్చే మొత్తం కలెక్షన్లలో వారాంతంలో వచ్చే కలెక్షన్ 60 నుండి 70 శాతం వరకూ ఉంటుందనీ, థియేటర్లు మూతపడటం వల్ల బిజినెస్ బాగా దెబ్బతింటుందనీ చెప్పారు. కాగా, వారాంతంలో సినిమాల కోసం ఇప్పటికే అడ్వాన్ బుకింగ్ తీసుకున్న వారికి ముంబైలోని మల్టీప్లెక్స్ యాజమాన్యాలు టిక్కెట్ ఛార్జీలు తిరిగి చెల్లిస్తున్నాయి. 'స్వైన్ ఫ్లూ' ప్రభావంతో థియేటర్లు మూతపడటం వల్ల ఆన్ లైన్ బుకింగ్స్ 5 నుంచి 10 శాతం వరకు తగ్గుతాయని ఆన్ లైన్ మూవీ బుకింగ్ వెబ్ సైట్ 'బుక్ మై షో డాట్ కామ్' పేర్కొంది. ఈనెల 13 నుంచి 16 వరకూ సుమారు 10,000 టెక్కెట్ల బుకింగ్ ఇప్పటికే పూర్తయిందనీ, ముంబై మల్టీప్లెక్స్ లలో బుకింగ్ చేసుకున్న వారికి సొమ్ము వాపసు ఇస్తామనీ వెబ్ సైట్ మార్కెటింగ్ హెడ్ రూపేష్ షా తెలిపారు.
Pages: -1- 2 News Posted: 13 August, 2009
|