క్వార్టర్స్ లో సైనా రెండో గేమ్‌లో భారత స్టార్ అద్భుతంగా ఆడిం ది. ప్రారంభం నుంచే ప్రత్యర్థిపై ఆధిక్యాన్ని ప్రదర్శించింది. పెత్యాకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా గేమ్‌పై పట్టు బిగించింది. సైనా చెలరేగి ఆడడంతో ఆధిక్యం 18-10కి చేరుకుంది. ఈ దశలో 10వ సీడ్ బల్గేరియన్ అనూహ్యంగా పుం జుకుంది. వరుస పాయింట్లతో స్కోరును సమం చేసింది. దీంతో మళ్లీ తొలి గేమ్ ఫలితం తప్పదా అనిపించింది. అయితే కీలక సమయంలో పుంజుకున్న సైనా వరుసగా మూడు పాయింట్లు సాధించి గేమ్‌ను దక్కించుకుంది. ఇక, మూడో గేమ్‌లో సైనాకు ఎదురేలేకుండా పోయింది.
పెద్ద ప్రతిఘటన లేకుండానే 21-10 తేడాతో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. మ్యాచ్‌లో సైనా 24 స్మాష్ విన్నర్లు సాధించగా, ప్రత్యర్థి 10 మాత్రమే అందుకుంది. నెట్ విన్నర్‌లోనూ సైనా(16) పైచేయి సాధించింది. పిత్యా వరుసగా 8 పాయింట్లు సాధించగా, సైనా 6మాత్రమే సాధించింది. సైనా 60 ర్యాలీస్‌లో విజయం సాధించగా, ప్రత్యర్థి 49లో గెలుపొందింది.
గుత్తా, డిజు జోడీ వీరవిహారం
మరోవైపు మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత జోడీ గుత్తాజ్వాల-వి.డిజు క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. వరుసగా రెండు గేమ్‌లలో విజయం సాధించి ముందంజ వేసింది. 8వ సీడ్‌గా బరిలో దిగిన దిజు-జ్వాల 21-11, 22-20 తేడాతో 12వ సీడ్ పోలండ్ జోడీ రాబర్ట్ మతెసియక్-నదిజ్దా కొస్టిజిక్‌ను ఓడించారు. తొలి గేమ్‌లో భారత జంట ఎటువంటి ప్రతిఘటన లేకుండానే విజయం సాధించింది. డిజు కంటే జ్వాల అటాకింగ్ ఆటను కనబరిచింది. అద్భుత షాట్లతో ప్రత్యర్థి జోడీని ముప్పతిప్పలు పెట్టింది. మరోవైపు డిజు సమన్వయంతో ఆడుతూ జ్వాలకు సహకరించాడు. రెండో గేమ్‌లోనూ భారత జోడీ ప్రారంభంలో ఆధిక్యాన్ని కనబరిచింది.
Pages: -1- 2 -3- News Posted: 13 August, 2009
|