చేజేతులా సైనా ఓటమి రెండో గేమ్ ప్రారంభంలో సైనా అద్భుతంగా ఆడింది. కళాత్మక షాట్లతో ప్రత్యర్థిని ముప్పతిప్పలు పెట్టింది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా భారీ ఆధిక్యంతో ముందుకు దూసుకు పో యింది. ఈ క్రమంలో సైనా తన ఆధిక్యాన్ని 9-2కు పెంచుకుంది. అయితే కీలక సమయంలో మళ్లీ పాత తప్పిదాలు పునరావృతం చేసింది. చేజేతులా ప్రత్యర్థిని కోలుకునేలా చేసింది. వరుసగా పాయింట్లు సమర్పించుకుని లిన్ కు ఆధిక్యాన్ని అందించింది. చూస్తుండగానే లిన్ ఆధిక్యంలో దూసుకెళ్లింది. ఒక దశలో 16-12తో ఆధిక్యంలో ఉన్న సైనా చెత్తగా ఆడి ఓటమిని కొనితెచ్చుకుంది. మరోవైపు మొక్కువొని ధైర్యంతో ఆడిన వాంగ్‌లిన్ 21-19తో గేమ్‌ను గెలుచుకుని సెమీస్‌కు చేరుకుంది. అంతేగాక ఈ గెలుపుతో ఇండోనేసియా ఓపెన్‌లో సైనా చేతిలో ఎదురైన ఓటమికి బదులు చేసుకుంది.
జ్వాల జోడీ ఔట్
అంతకుముందు జరిగిన మిక్స్‌డ్ డబుల్స్‌లోనూ భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో అద్భుతంగా ఆడిన జ్వాల-డిజు జోడీ క్వార్టర్ ఫైనల్లో పేలవంగా ఆడింది. ప్రత్యర్థికి ఏమాత్రం పోటీ ఇవ్వకుండానే చేతులెత్తేసింది. డిఫెండింగ్ చాంపియన్ ఇండోనేసియా జోడీ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించి సునాయాస విజయాన్ని అందుకుంది. 27 నిముషాల్లోనే ముగిసిన పోరులో జ్వాల జోడీ ఏమాత్రం ప్రతిఘటన ఇవ్వకుండానే ఓటమి పాలైంది. నోవా-లిలియానా జోడీ ప్రారంభం నుంచే విజృంభించి ఆడింది. భారత జోడీ తొలుత గట్టి పోటీని ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. మరో టైటిల్ వేటలో ఉన్న ఇండోనేసియా జోడీ పెద్దగా చెమటోడ్చకుండానే 21-16, 21-14తో విజయం సాధించింది. మరో పోటీలో 6వ సీడ్ జోచిమ్-క్రిస్టియానా(డెన్మార్క్) 21-10, 21-17తో నాలుగో సీడ్ హన్‌బిన్-యంగ్ యు(చైనా)ను ఓడించింది. ఇతర పోటీల్లో టాప్ సీడ్ యాంగ్ లీ-యో జంగ్ లీ(కొరియా), 7వ సీడ్ థామస్-కమిల్లా రైటక్(డెన్మార్క్) జంట విజయం సాధించి సెమీస్‌కు చేరుకున్నాయి.
Pages: -1- 2 -3- News Posted: 14 August, 2009
|