చేజేతులా సైనా ఓటమి టాప్ సీడ్ల నిష్ర్కమణ
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ఐదోరోజు సంచలనాలు న మోదు అయ్యాయి. మ హిళల, పురుషుల సింగిల్స్‌లో టాస్‌సీడ్లు క్వార్టర్‌ఫైనల్లోనే వెనుదిరిగారు. ఇండోనేషియాకు చెందిన ఆరోసీడ్ సోని ద్వి కున్‌కొరోతో జరిగిన క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లో టాస్‌సీడ్ లీ చోంగ్ వీ (మలేషియా) 21-16, 14-21, 21-12 తేడాతో పరాజయం చవిచూశాడు. గంట సేపు జరిగిన పోరులో తొలి గేమ్‌లో 10-13తో వెనుకబడి ఉన్న తరుణంలో సోనీ వరుసగా ఎనిమిది పాయింట్లు సాధించి 18-13కు దూసుకుపోయాడు. ఈ ఆధిక్యాన్ని చివరి వరకు నిలబెట్టుకొని గేమ్‌ను సొంతం చేసుకున్నాడు.
అయితే రెండోగేమ్‌లో లీ చోంగ్ పుంజుకొని గేమ్ ను గెలవడంతో మూడో గేమ్ కీలకంగా మారింది. ఇందులో 13-11 ఉన్నదశలో సోని వరుసగా 7 పాయింట్లు సాధించి మ్యాచ్‌ను కైవసం చేసుకొని సెమీఫైనల్‌కు చేరుకున్నాడు. ఇక మహిళల సింగిల్స్‌లో టాప్‌సీడ్ మీ జౌ (హాంకాంగ్)ను చైనా స్టార్ ఐదోసీడ్ జింగ్‌ఫాంగ్ ఇంటిదారి పట్టించింది. క్వార్టర్స్‌లో జింగ్‌ఫాంగ్ 21-15, 21-18 తేడాతో మీ జౌను ఓడించి సెమీస్ బెర్త్ ఖరారు చేసుకొంది. సెమీస్‌లో సోని, ఐదోసీడ్ లిన్‌డాన్ (చైనా)తో, జింగ్‌ఫాంగ్ ఎనిమిదో సీడ్ హంగ్‌యాంగ్‌పి (ఫ్రాన్స్)తో తలపడనున్నారు.
Pages: -1- -2- 3 News Posted: 14 August, 2009
|