పిల్లలంటే విసుగు: రాఖీ
ఎలేష్ ఆర్థికంగా తన కాళ్ల మీద తాను నిలబడగలిగినప్పుడే అతన్ని వివాహం చేసుకుంటానని చెబుతూ 'ఇది నా జీవితం. వివాహానికి సంబంధించిన నిర్ణయం పూర్తిగా నాదే. ఎలేష్ ను ప్రపంచంలోనే ఉత్తముడు కావచ్చు. అంతమాత్రాన నాకు ఉత్తముడు కావాలని ఏమీ లేదు. ఎలేష్ నా జీవితంలో మరో అవస్థీ కాకూడదని కోరుకుంటున్నాను. ఎలేష్ తో నిశ్చితార్ధం అయిన మాట నిజం. అతన్నెంతో ప్రేమిస్తున్నాను కూడా. అయితే సరైన సంపాదన లేని వ్యక్తి చేతిల్లో నా జీవితాన్ని పెట్టేదెలా? అందుకోసమే రాఖీ కా స్వయవరంలో కనిపించినట్టుగానే ఇద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నామా లేదా తెలుసుకునేందుకు మరో రియాల్టీ షోలో ఇద్దరూ కనిపించబోతున్నాం. అందులో ఎలేష్ తో ఎక్కువ సమయం కనిపించను. నాతో పాటు అందరూ ఎలేష్ ను ఈ షోలో చూడొచ్చు. నిజమైన ఎలేష్ ఎలా ఉండబోతున్నారో తెలుసుకోవాలని నాకు కూడా ఉంది. నాకు వెన్నుదన్నుగా నిలిచే వ్యక్తిని చేసుకోవాలని అనుకున్నాను. మేము కలిసి రెస్టారెంట్ కు వెళ్తే ఆ బిల్ నేను కాకుండా అతడే కట్టాలి. ఇండియాలోని భర్తలంతా ఇలాగే ఉండాలని భార్యలు కోరుకుంటారు. ఎలేష్ వచ్చి నా ఇంట్లో నాతో పాటు ఉండాలని నేను కోరుకోవడం లేదు. అతనో ఇల్లు సంపాదించుకునేంత వరకూ ఆగుతాను' అని రాఖీ తన వ్యక్తిగత అభిప్రాయలను పూసగుచ్చినట్టు చెప్పింది.
ఎలేష్ తనను పోషించే ఆర్థిక స్తోమత సంపాదించుకోవాలని తాను పరితపిస్తున్నట్టు రాఖీ చెప్పుకొచ్చింది. రాఖీ సావంత్ భర్తగా అతను పేరు తెచ్చుకోవడం తనకు ఇష్టం లేదనీ, ముంబైలో అతనకంటూ సొంతంగా ఇల్లు కూడా లేదనీ తెలిపింది. పూర్తిగా నిలదొక్కుకునేందుకు అతనికి కొంత సమయం పడుతుందనీ, ఈలోగా జనం తనపై చెడ్డ వదంతులు సృష్టిస్తుంటారనీ వాపోయింది. ఎలేష్ చాలా హుందా అయిన వ్యక్తని చెబుతూ 'అదొక్కడే సరిపోతుందా? అభిషేక్ అవస్థీ కూడా డీసెంట్ గానే ఉండేవాడు. అయితే రాఖీ బాయ్ ఫ్రెండ్ గానే అతను గుర్తింపు పొందాడు' అని పేర్కొంది. మొత్తానికి రాఖీ మనోగతం గ్రహించి ఎలేష్ మసులుకుంటాడో, రాఖీ అంచనాలు రీచ్ కాలేక మరో అవస్థీ అవుతాడో కాలమే చెప్పాలి.
Pages: -1- 2 News Posted: 19 August, 2009
|