టీమ్ ఇండియా ఇక బిజీ బిజీ
శిబిరంలో మొదటి సెషన్ లో కండిషనింగ్ పై దృష్టి పెట్టారు. కొందరు క్రీడాకారులు ఫిట్ నెస్ పరీక్ష చేయించుకున్నారు. మరి కొందరు వీరేంద్ర సెహ్వాగ్ తో మాట్లాడసాగారు. ఇక మహేంద్ర సింగ్ ధోని, దినేష్ కార్తిక్, హర్భజన్ సింగ్ కాసేపు బ్యాడ్మింటన్ ఆడారు. జట్టు సభ్యులు త్వరలోనే ముమ్మరంగా శిక్షణ శిబిరంలో పాల్గొంటారని కిర్ స్టెన్ చెప్పారు.
'మా ప్రాక్టీసింగ్ పై దృష్టిని కేంద్రీకరించవలసిన సమయం వచ్చింది. వచ్చే మూడు నాలుగు రోజుల పాటు మేము పలు బంతులను కొట్టబోతున్నాం. క్రీడాకారులు ఎక్కువగానే బౌలింగ్ చేయబోతున్నారు' అని ఆయన చెప్పారు.
శ్రీలంకలో పరిస్థితులకు భిన్నంగా దక్షిణాఫ్రికాలో పరిస్థితులు ఉంటాయని తాను అనుకోవడం లేదని కిర్ స్టెన్ చెప్పారు. కాని, 'దక్షిణాఫ్రికాలో మాకు టోర్నీకి సన్నద్ధం కావడానికి లభించే సమయమే అత్యంత ప్రధానమైనది' అని ఆయన అన్నారు.
అయితే, షార్ట్ పిచ్ బంతులు ఎదుర్కోవడంలో బ్యాట్స్ మన్ లు కొందరికి తీవ్ర సమస్యలు ఉన్నాయనే అభిప్రాయంతో జట్టు కోచ్ ఏకీభవించలేదు. 'టి20 టోర్నీలో ఒక గేమ్ లో మాత్రమే షార్ట్ పిచ్ బౌలింగ్ సమస్యగా ఉండడం గమనించాను. అందువల్ల దానిని ఒక సమస్యగా నేను భావించడం లేదు' అని ఆయన చెప్పారు.
'యువ క్రీడాకారులతో సహా వారంతా సుదీర్ఘ కాలం వన్ డే క్రికెట్ లో విశేషంగా రాణించారు. దీర్ఘకాలిక ప్రాతిపదికపై మనం ఈ విషయాలను పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది' అని కిర్ స్టెన్ అన్నారు.
Pages: -1- 2 News Posted: 28 August, 2009
|