సైన్సుకు పునరుత్తేజం
పరిశోధన నాణ్యత, ఉత్పత్తి విషయంలో చైనా, ఇతర వర్ధమాన దేశాల కన్నా ఇండియా వెనుకబడిపోతున్నదని ఇటీవల తరచుగా ప్రధాని, ప్రభుత్వ సీనియర్ అధికారులు, అగ్రశ్రేణి సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దేశంలో ఉన్నత విద్యా విధానం పునఃరూపకల్పనలో విశేష పాత్ర ఉండాలని ఐఐఎస్ సి కోరుకుంటున్నదని సంస్థ అధికారులు తెలిపారు. ఒక వైపు అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల మధ్య, మరొక వైపు పోస్ట్ గ్రాడ్యుయేట్, పరిశోధన కోర్సుల మధ్య అనుసంధానం లోపిస్తున్నందుకు సంస్థ తరచు విమర్శలకు గురవుతున్నది. చివరకు ఐఐటిలు లేదా ఉన్నత స్థాయి విశ్వవిద్యాలయ కళాశాలలు వంటి ప్రసిద్ధ విద్యా సంస్థలలో కూడా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులను పోస్ట్ గ్రాడ్యుయేట్ సైన్సులు, ఇంజనీరింగ్ కోర్సులలో కొనసాగేట్లు చూడలేకపోవడమే ఇందుకు కారణంగా తరచు పేర్కొంటున్నారు.
ఐఐఎంలలోని కోర్సుల వలె ప్రసిద్ధి చెందిన, అత్యంత పోటీ గల ప్రొఫెషనల్ కోర్సుల యోగ్యతలపై కొందరు తల్లిదండ్రులు, విద్యార్థులు సందేహాలు వ్యక్తం చేస్తున్న సమయంలో ఐఐఎస్ సి ఈ ఆలోచన చేయడం గమనార్హం. ఆ కోర్సులు ఇటీవలి వరకు గణనీయంగా ఆర్థికంగా ప్రతిఫలాలను తీసుకువస్తూనే ఉన్నాయి. ఆర్థిక మాంద్యంతోను, కొందరు యువ ప్రొపెషనల్స్ అవకాశాల లేమిని తట్టుకోలేని స్థితిలో ఉండడంతోను ఉన్నత విద్యా కోర్సులే మరింత ప్రయోజనదాయకమనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
'ఐఐఎస్ సిలోకి యువ ప్రతిభావంతులను ఆకర్షించడం ద్వారా సంస్థ స్వభావాన్ని మార్చవచ్చు. ఇది ఫ్యాకల్టీకి కొత్త సవాళ్ళను తీసుకురాగలదు. వచ్చే 100 సంవత్సరాలలో ఐఐఎస్ సి వృద్ధికి రూపొందించిన బృహత్ ప్రణాళికలో భాగమే ఈ పథకం' అని బిశ్వాస్ వివరించారు.
ఉన్నత విద్య, పరిశోధన రంగాలలోని ఇతర సంస్థలకు తన అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఆదర్శప్రాయం కాగలదని ఐఐఎస్ సి ఆశిస్తున్నది. విద్యార్థుల అభీష్టానుసారం ఏదైనా స్పెషలైజేషన్ తో ఉదాహరణకు ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ లేదా బయాలజీతో బ్యాచ్ లర్ ఇన్ సైన్స్ (బిఎస్) ప్రోగ్రామ్ గా దీనికి నామకరణం చేస్తారు.
Pages: -1- 2 -3- News Posted: 7 September, 2009
|