సైన్సుకు పునరుత్తేజం
అయితే, ఉత్తమ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ల వల్ల ఐఐటిల విషయంలో వలె విశేష ప్రాముఖ్యతను సంతరింపచేయడానికి, ప్రభుత్వం, పరిశ్రమల నుంచి నిధులు సమీకరించడానికి కూడా వీలు కలుగుతుంది. ఈ పథకం వెనుక ప్రధానోద్దేశం ఇదేనని సంస్థ వర్గాలు అంగీకరించాయి. ఇన్ స్టిట్యూట్ కు, ఐఐటిలకు మధ్య పరిశోధన ఉత్పాదకతలో అంతరం తగ్గిపోతున్నదని ఐఐఎస్ సిలోని ఫ్యాకల్టీలో కొందరు హెచ్చరికలు చేస్తున్న సమయంలో ఈ పథకానికి శ్రీకారం చుడుతున్నారు.
కాగా, ఈ కోర్సు కోసం విద్యార్థుల ఎంపికకు తాము అనుసరించాలనుకుంటున్న ప్రక్రియపై ఐఐఎస్ సి వర్గాలు మౌనముద్ర దాలుస్తున్నాయి. అయితే, మొదటి ఐదు సంవత్సరాలలో దీనిపై ఆసక్తి ప్రదర్శించే సుమారు 500 మంది 'మేటి' విద్యార్థులను మాత్రమే చేర్చుకోవచ్చునని ఆ వర్గాలు సూచించాయి. 'ఈ పరిమితిని పెంచాలని జనం నుంచి తీవ్ర స్థాయిలో అభ్యర్థనలు వచ్చిన పక్షంలో ఆతరువాత ఈ విద్యార్థుల సంఖ్యను మేము పెంచవచ్చు' అని సంస్థ ప్రతినిధి ఒకరు సూచించారు.
ఈ సంస్థ రూపొందించిన అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు మొదటి మూడేళ్ళలో ఆరు సెమిస్టర్ల మేరకు ఉంటుంది. క్లాసికల్ సైంటిఫిక్, మాథమాటికల్, ఇంజనీరింగ్ సబ్జెక్టులపై విద్యార్థులలో మౌళిక పరిజ్ఞానాన్ని పటిష్ఠం చేయడమే దీని లక్ష్యంగా ఉంటుంది. విద్యార్థులు హ్యుమానిటీస్ ను కూడా అధ్యయనం చేయవలసి ఉంటుంది. వారు చరిత్ర, ఫిలాసఫీ, సోషియాలజీ, మేనేజ్ మెంట్ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ రంగాలలోని కోర్సులలో దేనినైనా వారు ఎంచుకోవచ్చు.
మొదటి మూడు సెమిస్టర్ల తరువాత విద్యార్థులు ఏదో ఒక 'స్ట్రీమ్'ను ఎంచుకోవలసి ఉంటుంది. ఇతర సబ్జెక్టుల కన్నా మరింత సమగ్రంగా అధ్యయనం చేయాలని తాము అభిలషించే సైన్సులు, ఇంజనీరింగ్ సబ్జెక్టులలో ఒక దానిని వారు ఎంపిక చేసుకోవలసి ఉంటుంది. తాము ఎంచుకున్న స్ట్రీమ్ లో మేజరింగ్ తో పాటు విద్యార్థులు ఈ కోర్సు సమగ్రత కోసం ఇతర స్ట్రీమ్ లలో కనీస సంఖ్యలో నిర్దుష్ట కోర్సుల అధ్యయనాన్ని కొనసాగిస్తారు. ఈ కోర్సు చివరి సంవత్సరం ప్రతి విద్యార్థి తప్పకుండా చేపట్టవలసిన ఒక రీసర్చ్ ప్రాజెక్టుకు కేటాయించవలసి ఉంటుంది.
Pages: -1- -2- 3 News Posted: 7 September, 2009
|