'షాక్' డెత్స్ బూటకమేనా? ఇక మిగిలిన 472 మంది మరణాలు వైఎస్ మృతితో ఏ మాత్రం సంబంధం లేనివేనని అధిష్టానం గుర్తించినట్లు ఏఐసిసి వర్గాల కథనం. ఈ మరణాలపైనే రాష్ట్రం నుంచి ఒక వర్గం వాస్తవాలతో కూడిన పూర్తి స్థాయి నివేదికను అధిష్టానానికి పంపింది. 472 మందిలో ఎక్కువమంది చాలాకాలం నుంచి గుండెనొప్పి, అనారోగ్యం, వయసు మీరడం, విషజ్వరాలు, కుటుంబసమస్యలు, బ్రైన్‌ట్యూమర్, కిడ్నీ వ్యాధులు, ఎల్బీస్టేడియంలో జరిగిన తొక్కిసలాట, భార్యాభర్తల మధ్య గొడవలు, పచ్చకామెర్లు, మలేరియా వంటి సాధారణ వ్యాధులతోనే మృతి చెందినట్లు నివేదికలు వెల్లడించాయి. ఇందులో అద్దంకికి చెందిన రహీం టిడిపికి చెందిన వ్యక్తిగా ఆంధ్ర నుంచి అందిన ఫిర్యాదులో తేలింది. అంతేగాకుండా, 85 సంవత్సరాల వయసున్న వారి సహజ మరణాలను సైతం వైఎస్ ఖాతాలో కలిపివేసిన వైనం కూడా పరిశీలనలో వెల్లడయింది.
అధిష్ఠానం గుర్తించిన ప్రధానాంశాల్లో మృతి చెందిన వారిలో 55-85 లోపు వయసున్న వారి సంఖ్య 201గా నిర్ధారించారు. 50-55 లోపు వయసున్నవారి సంఖ్య 131 మందిగా గుర్తించినట్లు తెలిసింది. అయితే, ఇవన్నీ జగన్ ప్రత్యక్ష ప్రమేయంతో జరిగి ఉండకపోవచ్చని, ఆయనకు దగ్గరయేందుకు ఆయన వర్గీయులు ప్రదర్శించిన అత్యుత్సాంగా కూడా పరిగణించవవ్చని చెబుతున్నారు. అదే సమయంలో అసలు ఈ వివరాలను జగన్ వర్గీయులు రోజూ పనికట్టుకుని మీడియాకు ఇవ్వవలసిన అవసరమేమిటి? దానివల్ల వారికొచ్చే లాభమేమిటన్న సందేహం వారిని ఆలోచనలో పడేసినట్లు ఓ నాయకుడు వెల్లడించారు. అయితే, ఇవన్నీ జగన్‌కున్న ఫాలోయింగ్‌కు మద్దతుగా చూపడానికి చేసిన ప్రయత్నంగా కూడా అధిష్టానం భావిస్తున్నట్లు చెబుతున్నారు.
అయితే, ఈ కసరత్తు జరుగుతున్న సమయంలోనే.. ఒక నాయకుడి కోసం 44 మంది నిజంగా మృతి చెందటం అరుదైన విషయమేనని విస్మయం వ్యక్తం చేశారు. గతంలో ప్రజాభిమానం సంపాదించుకున్న ఎమ్జీఆర్, ఎన్టీఆర్, కామరాజ్ నాడార్, రాజ్‌కుమార్ వంటి సినీ గ్లామర్ ఉన్న రాజకీయ నేతలు మరణించిన సమయంలోనూ ఈ విధంగా బలవన్మరణాలు జరగని విషయాన్ని వారు ఈ సందర్భంగా విశ్లేషించుకున్నారు. ఇవన్నీ పరిశీలిస్తే వైఎస్‌కు రాష్ట్రంలో ఉన్న అభిమానమేమిటో స్పష్టమవుతోందన్నారు. అయితే, వాటిని మాత్రమే ప్రస్తావించకుండా ‘అనవసర లెక్కలు’ సృష్టించడమే ఇంత గందరగోళం, అనుమానాలకు దారితీస్తోందన్న అభిప్రాయం కూడా వ్యక్తమయింది.
Pages: -1- -2- 3 News Posted: 18 September, 2009
|