ఇశాంత్ పై ధోని ధీమా
ఫీల్డింగ్ ఒక సమస్యగా ఉందని, ఇది రాత్రికి రాత్రి మెరుగుపడబోదని ధోని అన్నాడు. 'ఫీల్డింగ్ ఆందోళన కలిగిస్తున్నది. ఇటువంటి టోర్నమెంట్ లో ఫీల్డింగ్ అత్యుత్తమ స్థాయిలో ఉండవలసి ఉంటుంది. ఫీల్డింగ్ లో తడబడినప్పుడల్లా నష్టం ఎక్కువగా వాటిల్లుతున్నది. నేరుగా రనౌట్లు చేసే అవకాశాలను కోల్పోతున్నాం. క్యాచ్ లు జారవిడుస్తున్నాం' అని అతను పేర్కొన్నాడు. 'ఇది తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. వాటిని సరిచేసేందుకు ఎంతో కృషి చేస్తున్నాం. రాత్రికి రాత్రే ఇది మెరుగుపడదు. ఇది రనౌట్, క్యాచ్ లకు సంబంధించినది మాత్రమే కాదు. ప్రత్యర్థుల స్కోరులో 20 పరుగులైనా తగ్గించగలిగేలా ఫీల్డింగ్ చేయవలసిన అగత్యం ఉంది' అని ధోని అన్నాడు.
తొలిసారిగా చాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకోవడానికై భారత జట్టు దుబాయి మీదుగాజోహాన్నెస్ బర్గ్ కు బయలుదేరే లోపల ధోని, కోచ్ గారీ కిర్ స్టెన్ ఈ విషయమై దృష్టి కేంద్రీకరించవలసి ఉంటుంది.
ఇది ఇలా ఉండగా, ఓపెనింగ్ బ్యాట్స్ మన్ గౌతమ్ గంభీర్ తన ఫిట్నెస్ పరీక్షలో నెగ్గాడు. అతను భారత జట్టుతో పాటు దక్షిణాఫ్రికాకు బయలుదేరి వెళతాడు. పొట్ట కండరాల నొప్పి కారణంగా శ్రీలంకలో ఇటీవల ముక్కోణపు సీరీస్ నుంచి అతను ముందుగానే ఇండియాకు తిరిగి వచ్చిన విషయం విదితమే. గురువారం ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ లో కోచ్ గారీ కిర్ స్టెన్ పర్యవేక్షణలో గంభీర్ కు ఫిట్నెస్ పరీక్ష నిర్వహించారు.
గంభీర్ తిరిగి రావడం జట్టుకు ఉపశమనమేనని ధోని వ్యాఖ్యానించాడు. 'గౌతమ్ శుభారంభం ఇవ్వడం మాత్రమే కాదు. అతను 50 ఓవర్ల వరకు క్రీజ్ వద్ద నిలవగలడు' అని ధోని చెప్పాడు.
Pages: -1- 2 News Posted: 18 September, 2009
|