ఇండియాకు వార్మప్ ఓటమి
కాగా, పాకిస్తాన్ జట్టు తాము టాప్ ఫామ్ లో ఉన్నామని నిరూపిస్తూ తమ రెండవ వార్మప్ విజయాన్ని సాధించారు. బెనోనిలోి విల్లోమూర్ పార్క్ మైదానంలో పాక్ జట్టు ఇంకా 19 బంతులు మిగిలి ఉండగా వారియర్స్ జట్టుపై ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. వారియర్స్ జట్టు టాస్ కోల్పోయిన తరువాత ఓపెనర్ జస్టిన్ క్రూష్ 96 పరుగులు స్కోరు చేశాడు. అతను మైకేల్ స్మిత్ తో కలసి మొదటి వికెట్ కు 79 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. స్మిత్ 42 పరుగులు చేశాడు. ఆర్నో జాకబ్స్ 54 పరుగులు చేశాడు. వారియర్స్ జట్టు తమ ఇన్నింగ్స్ లో ఆరు వికెట్ల నష్టానికి 261 పరుగులు స్కోరు చేసింది. ఆతరువాత పాక్ జట్టు 47 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసి గెలిచింది. షోయబ్ మాలిక్ 133 బంతులు ఎదుర్కొని 130 పరుగులతో అజేయంగా నిలిచాడు. మిస్బా-ఉల్-హక్ 67 బంతులు ఎదుర్కొని 58 పరుగులు చేశాడు.
అంతకు ముందు శుక్రవారం పాక్ జట్టు చేతిలో ఎదురైన పరాజయం నుంచి తేరుకున్న శ్రీలంక జట్టు ప్రిటోరియాలోని ఎల్ సి డివిలీర్స్ మైదానంలో వెస్టిండీస్ జట్టుతో జరిగిన పోటీలో ఇంకా 15 బంతులు మిగిలి ఉండగా ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచి ముందు బ్యాటింగ్ ను ఎంచుకున్న విండీస్ జట్టు శుభారంభాన్నే చేసింది. డేల్ రిచర్డ్స్, డెవన్ స్మిత్ జతగా రెండవ వికెట్ కు 82 పరుగులు చేశారు. డేల్ రిచర్డ్స్ 60 బంతులలో 59 పరుగులు, డెవన్ స్మిత్ 102 బంతులలో 67 పరుగులు స్కోరు చేశారు. కాని తక్కిన బ్యాట్స్ మన్ లలో చెప్పుగోదగిన పరుగులు చేసిన వారు లేకపోవడంతో విండీస్ జట్టు 46 ఓవర్లలో 201 పరుగులకు ఆలౌట్ అయింది. శ్రీలంక స్పిన్నర్లు ముత్తయ్య మురళీధరన్ 17 పరుగులకు 3 వికెట్లు, అజంతా మెండిస్ 31 పరుగులకు 3 వికెట్లు పడగొట్టారు. ఆతరువాత బ్యాట్ చేసిన శ్రీలంక జట్టు 48 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 202 పరుగులు స్కోరు చేసి గెలుపొందింది. మహెలా జయవర్ధనె 93 బంతులలో 67 పరుగులు స్కోరు చేయగా తిలినా కండంబి 67 బంతులు ఎదుర్కొని 44 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
కాగా, చాంపియన్స్ ట్రోఫీ టోర్నీ మంగళవారం దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్ల మధ్య పోటీతో ప్రారంభం కానున్నది.
Pages: -1- 2 News Posted: 21 September, 2009
|