డిడి కొత్త సారథి గంభీర్
'నేను గతంలో రంజీ ట్రోఫీలో ఢిల్లీకి సారథ్యం వహించాను. మేము టైటిల్ గెలుచుకున్నాం. వీరూ గాయపడినప్పుడు ఐపిఎల్-2లో ఢిల్లీ డెవిల్స్ కు నాయకత్వం వహించే అవకాశం నాకు లభించింది. ఆ అనుభవం ఎంతో గొప్పది. నేను నేర్చుకున్నదంతా ఆచరణలోకి తీసుకురాగలనని ఆశిస్తున్నాను. నేను సలహా కోసం ఎప్పుడూ వీరును, జట్టులోని ఇతర సీనియర్లను సంప్రదించగలను. జట్టులో మా మధ్య గొప్ప స్నేహ సంబంధాలు ఉన్నాయి. మేము ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి ఇది దోహదం చేయగలదు' అని గంభీర్ పేర్కొన్నాడు.
గంభీర్ సారథ్యంలో జట్టు విజయాలు సాధించగలదనే తాను దృఢంగా విశ్వసిస్తున్నట్లు జిఎంఆర్ స్పోర్ట్స్ డైరెక్టర్ బి. వంచీ తెలిపారు. 'గౌతమ్ నాయకత్వం వహిస్తుండడంతోను, దినేష్ కార్తీక్ వైస్ కెప్టెన్ గా అతనికి చేయూత ఇస్తుండడంతోను ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు ఘన విజయాలు సాధించగలదని మా దృఢ విశ్వాసం' అని ఆయన చెప్పారు.
రంజీ ట్రోఫీ టోర్నీలో తమిళనాడుకు విశిష్ట స్థాయిలో నాయకత్వం వహించిన దినేష్ కార్తీక్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, 'నన్ను వైస్ కెప్టెన్ ను చేసి ఎంతగానో గౌరవించారు. జట్టులో బాధ్యతతో వ్యవహరిస్తున్నాను. సత్ఫలితాలు సాధించగల గొప్ప జట్టు మాకు ఉన్నది' అని చెప్పాడు.
చాంపియన్స్ లీగ్ టోర్నీ కోసం ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టుకు ఎంపిక చేసిన క్రీడాకారులు: గౌతమ్ గంభీర్ (కెప్టెన్), దినేష్ కార్తీక్ (వైస్ కెప్టెన్), వీరేంద్ర సెహ్వాగ్, ఎ.బి. డివిలీర్స్, తిలకరత్నె దిల్షన్, డేనియల్ వెట్టోరి, పాల్ కోలింగ్ వుడ్, ఆశిష్ నెహ్రా, అమిత్ మిశ్రా, డిర్క్ నానెస్, ఒవైస్ షా, రజత్ భాటియా, ప్రదీవ్ సంగ్వాన్, విజయకుమార్ యో మహేష్, మిథున్ మన్హాస్.
Pages: -1- 2 News Posted: 21 September, 2009
|