ఇశాంత్ సమస్య ఏమిటి?
2008 నుంచి క్రికెట్ లో మూడు విభాగాలలో ఇశాంత్ స్థానం తప్పనిసరి అయింది. అతను ఇండియా తరఫునే 4663 బంతులు వేశాడు. అది మరీ అతిగా కనిపించకపోవచ్చు. అతను దాదాపు 122 క్రీడా దినాలలో పాల్గొన్నాడు. ప్రాక్టీసు, ప్రయాణాలను, ఇక ఢిల్లీ తరఫున ఆడినది కూడా లెక్కలోకి తీసుకుంటే అది కూడా చెప్పుకోదగిన సంఖ్య కాకపోవచ్చు.
ఇశాంత్ ఏదో సాధారణ మీడియం పేస్ బౌలర్ వంటి వాడు కాడు. అతను ప్రతి బంతిని వేసేటప్పుడు ఎంతో శక్తిని వెచ్చిస్తుంటాడు. అటువంటి బౌలర్ విషయంలో పని భారం విషయంలో ఆచితూచి వ్యవహరించవలసి ఉంటుంది. ఇశాంత్ తో బౌల్ చేయించాలనే కెప్టెన్ ఆత్రుత అర్థం చేసుకోదగినదే. కాని అతని అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి కదా!
అయితే, ఇండియా తన ఫాస్ట్ బౌలర్ల పట్ల వ్యవహరించే తీరును మార్చుకోవలసిన సమయం వచ్చి ఉండవచ్చు. ఎక్కువ మంది ఫాస్ట్ బౌలర్లతో ఒక పూల్ ను ఏర్పాటు చేసుకుని వారిలో అలసటను, గాయాలను నివారించడానికై వంతులవారీగా వారిని ఉపయోగించుకోవలసిన సమయం ఇదే.
Pages: -1- 2 News Posted: 30 September, 2009
|