ఫలితం లేని భారత్ గెలుపు
ఏడు వికెట్ల భారీ తేడాతో విండీస్ పై భారత్ విజయం సాధించినప్పటికీ చాంపియన్స ట్రోఫీ నుంచి లీగ్ దశలోనే వైదొలగాల్సిన దుస్థితి ఎదురైంది. భారత సీమర్లు ప్రవీణ్ కుమార 22 పరుగులిచ్చి మూడు వికెట్లు, ఆశీష్ నెహ్రా 31 పరుగులిచ్చి మూడు వికెట్లు చెలరేగి బౌల్ చేయడంతో విండీస్ బ్యాటింగ్ లైన్ కకావికలైంది. విండీస్ జట్టులో టాప్ స్కోర్ చేసిన బెహ్నార్డ్ 46 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్ సహాయంతో 22 పరుగులు, స్మిత్ 26 బంతుల్లో మూడు బౌండరీలతో 21 పరుగులు చేయగలిగారు. ఇండియా స్పిన్నర్ హర్భజన్ సింగ్ రెండు వికెట్లు పడగొట్టాడు.
భారత జట్టు 130 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగి మూడు వికెట్లు మాత్రమే నష్టపోయి 32.1 ఓవర్లలోనే విజయం సాధించింది. విరాట్ కోహ్లీ 104 బంతులు ఎదుర్కొని రెండు సిక్సర్సు, 9 బౌండరీల సాయంతో 79 పరుగులు చేసిన నాటౌట్ గా నిలిచాడు. మురళీ కార్తీక 79 బంతుల్లో నాలుగు బౌండరీలతో 34 పరుగులు చేశాడు. విండీస్ బౌలర్లలో రోచ్, టోంగో చెరో వికెట్ తీసుకున్నారు. అర్ధ సెంచరీ చేసిన భారత బ్యాట్స్ మన్ కోహ్లికీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
స్కోర్ల వివరాలు :
వెస్టిండీస్ ఇన్నింగ్స్ : ఫ్లెచర్ 0, పావెల్ 5, స్మిత్ 21, డౌలిన్ 14, బెర్నార్డ్ 22, సమి 23, క్రాన్ డన్ 5, మిల్లెర్ నాటౌట్ 17, రోచ్ 4, టోంగ్ 5, ఎక్స్ ట్రాలు 12. మొత్తం 36 ఓవర్లలో 129 పరులు చేసిన విండీస్ ఆలౌట్ అయింది.
భారత్ ఇన్నింగ్స్ : దినేశ్ కార్తీక్ 34, గంభీర్ 6, రాహుల్ ద్రావిడ్ రన్నౌట్ 4, కోహ్లీ నాటౌట్ 79, నాయర్ నాటౌట్ 0, ఎక్స్ ట్రాలు 7. మొత్తం 32.1 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి భారత్ లక్ష్యం 130 పరుగులు చేసింది.
భారత్ బౌలింగ్ : ప్రవీణ్ కుమార్, ఆశీష్ నెహ్రా మూడేసి వికెట్లు తీసుకున్నారు. ధోనీ 1, హర్భజన్ సింగ్ 2, అమిత్ మిశ్రా 1 వికెట్ పడగొట్టారు.
విండీస్ బౌలింగ్ : రోచ్, టోంగ్ చెరో వికెట్ తీసుకున్నారు. రాహుల్ ద్రావిడ్ రన్నౌట్ అయ్యాడు.
Pages: -1- 2 News Posted: 1 October, 2009
|