రియోలో 2016 ఒలింపిక్స్
అంతకుముందు వోటింగ్ ను ప్రారంభించినప్పుడు ఫేవరైట్ అయిన షికాగో నగరానికి తొలి రౌండ్ లోనే ఓటమి ఎదురైంది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన భార్య మిచెల్లి ఒబామా కనీవినీ ఎరగని రీతిలో మద్దతు ఇచ్చినప్పటికీ షికాగో నగరానికి ఈ ఫలితం ఎదురుకావడం గమనార్హం. ఐఒసి సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన తొలి యుఎస్ అధ్యక్షుడు ఒబామా అయ్యారు. కాని ఆయన ఐఒసి ప్రతినిధులను ప్రభావితం చేయలేకపోయారు. షికాగో ఫలితమే టోక్యోకు రెండవ రౌండ్ లో ఎదురైంది. దీనితో తుది రౌండ్ కు మాడ్రిడ్, రియో మిగిలాయి. కాగా, ఒలింపిక్ క్రీడోత్సవాలను నిర్వహించే తొలి దక్షిణ అమెరికా నగరం రియోయే అవుతుంది.
2016 వేసవి ఒలింపిక్స్ కు ఆతిథ్యం ఇచ్చేందుకు చేసిన ప్రయత్నంలో షికాగో విఫలమైనట్లు ప్రకటన వెలువడగానే ఆ నగర ప్రతినిధులు అవాక్కయ్యారు. వారి కనుల వెంబడి అశ్రుధారలు కారాయి. ఫేవరైట్ అనిపించుకున్న షికాగో చివరకు 'కూడా పోటీ చేసింది' అనే స్థాయికి చేరింది.
డెన్మార్క్ రాజధాని కోపెన్ హాగన్ లో ఐఒసి ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందు పెక్కు బెట్టింగ్ వెబ్ సైట్లలో షికాగో నగరమే ఫేవరైట్ గా ఉన్నది. కాని, 30 లక్షల జనాభా ఉన్న షికాగో నగరం ఈ పోటీలో రియో డి జనీరో, మాడ్రిడ్, టోక్యోల ముందు వీగిపోయింది.
Pages: -1- 2 News Posted: 3 October, 2009
|