కమల్ ను ప్రశ్నించిన ఖైదీ
కోయంబత్తూరు పేలుళ్ల కేసుకు తీవ్రవాదంతోనో, ఉగ్రవాదంతోనే సంబంధం లేదనీ, రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలేనని ఇన్వెస్టిగేషన్ అధికారులు నిర్దారించినట్టు బాషా తెలిపారు. ఆ ప్రకారమే కోర్టు తమను శిక్షించిందని అన్నారు. తీవ్రవాదానికి తీవ్రవాదమే పరిష్కారమనే కాన్సెప్ట్ తో సినిమా తీయాలనుకున్నప్పుడు తమతో చర్చించి ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. హింసకు పాల్పడే నిజమైన ఉన్మాదులపై సినిమా తీసే దమ్ము కమల్ కు లేదని ఆయన ఘాటుగా విమర్శించారు. దేశ లౌకిక, ప్రజాస్వామ్య స్ఫూర్తిని బలపరచే విధంగా ఆయన చర్చలు ఉండాలని భాషా సూచించారు. ఆ లేఖ చివర్లో బాషా సంతకం చేశారు. బాషా వెలిబుచ్చిన అభిప్రాయలకు దాదాపు దగ్గరగా ఉండే మరో లేఖను ఇలామ్ తమిళల్ ఇయక్కం కూడా ఇటీవలే కమల్ కు పంపింది. ఈ లేఖలపై కమల్ ఇంకా స్పందించవలసి ఉంది.
Pages: -1- 2 News Posted: 8 October, 2009
|