అదర గొట్టిన డుమిని అంతకు ముందు రాయల్ ఛాలెంజర్స్ కెప్టెన్ అనిల్‌కుంబ్లే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లుగా కలీస్-ఊతప్పలు వచ్చారు. ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో లాండ్‌వెల్డ్ బౌలింగ్ కలీస్ (8) కీపర్ కేనింగ్‌కు క్యాచ్ ఇచ్చి నిష్ర్కమించాడు. ఆ తర్వాత ద్రవిడ్ క్రీజులోకి వచ్చాడు. క్లీన్‌వెల్డ్ బౌలింగ్‌లో ద్రవిడ్ కవర్‌డ్రైవ్‌తో పరుగుల ఖాతా ఆరంభించాడు. 18 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఊతప్ప క్యాచ్‌ను లాంగ్‌వెల్డ్ జార విరిచాడు. ఆ తర్వాత ఊతప్ప భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. దాంతో ఆరంభంలో మందకొడిగా సాగిన స్కోరు బోర్డు 10 ఓవర్లు ముగిసేసరికి 69 పరుగులకు చేరింది. జొండెంకి వేసిన ఇన్నింగ్స్ 11వ ఓవర్‌లో ఊతప్ప వరుసగా రెండు సిక్స్‌లు కొట్టి అర్ధసెంచరీ పూర్తి చేశాడు. ఆ తర్వాతి బంతికే భారీ షాట్‌కు ప్రయత్నించిన ఊతప్ప 51 (39 బంతులు: 7 ఫోర్లు, 2 సిక్స్) పాయింట్‌లో గిబ్స్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. కొద్ది సేపటికే ద్రవిడ్ (28: 24 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) రనౌట్ కాగా, కోహ్లి (17) భారీ షాక్‌కు ప్రయత్నించి నిష్ర్కమించాడు.
రాస్ టేలర్ ప్రతాపం
చివర్లో మనీస్ పాండే జతతో రాస్ టేలర్ కేప్ కోబ్రాస్ బౌలర్లపై ప్రతాపం చూపాడు. భారీ సిక్స్‌లు, ఫోర్లుతో విరుచుకుపడ్డాడు. క్లీన్‌వెల్డ్ వేసిన 18వ ఓవర్‌లో 14 పరుగులు సాధించిన టేలర్ ఆ తర్వాత జొండెకి బౌలింగ్‌లో ఫోర్, రెండు వరుస సిక్స్‌లతో 18 పరుగులు పిండుకున్నాడు. ఇక ఇన్నింగ్స్ చివరి రెండు బంతులును సిక్స్, ఫోర్‌గా మలిచి 24 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. దాంతో ఛాలెంజర్స్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. టేలర్ జోరుకు చివరి నాలుగు ఓవర్లలో 61 పరుగులు వచ్చాయి. టేలర్ 24 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 53 పరుగులతో, మనీష్ 10 పరుగులతో అజేయంగా నిలిచారు. మ్యాచ్‌లో 32 ఫోర్లు, 13 సిక్స్‌లు నమోదు అయ్యాయి.
Pages: -1- 2 News Posted: 9 October, 2009
|