త్యాగికి ఫలితం దక్కింది
త్యాగి ప్రతిభా పాటవాలు మొదట ఫాస్ట్ బౌలర్ల శిబిరంలో ఉత్తర ప్రదేశ్ కెప్టెన్ మహమ్మద్ కైఫ్, కోచ్ జ్ఞానేంద్ర పాండే దృష్టికి వచ్చాయి. శలభ్ శ్రీవాత్సవ్ ఇండియన్ క్రికెట్ లీగ్ (ఐసిఎల్)కు వెళ్ళిపోగా త్యాగికి యుపి జట్టులో ఆడేందుకు అవకాశం లభించింది. 'అతని పేస్ కు మేము ముగ్ధులమయ్యాం. అతను నెట్స్ లో బాగా బౌల్ చేస్తున్నాడు. అందువల్ల అతనిని జట్టులోకి తీసుకున్నాం. అది మంచి నిర్ణయమేనని తేలింది. తనపై మేము పెట్టుకున్న నమ్మకానికి తగినట్లుగా త్యాగి తన తొలి పోటీలోనే పది వికెట్లు తీసుకున్నాడు' అని పాండే తెలిపారు.
గాయం కారణంగా తాను పక్కకు తప్పుకోవలసి వచ్చిన పరిస్థితి గురించి త్యాగి ప్రస్తావిస్తూ, 'నాకేమీ వ్యతిరేక భావాలు కలగలేదు. నాకు అంతటా వత్తాసు లభించింది. కైఫ్, సురేష్ రైనా, కోచ్ నాకు అండగా నిలచి, నా నైతిక స్థైర్యం దెబ్బ తినకుండా చూశారు. తిరిగి ఆడినప్పుడు నా సత్తా ప్రదర్శించాలని నిర్ణయించుకున్నాను' అని చెప్పాడు.
కాగా, ఘజియాబాద్ నగరానికి చెందిన త్యాగి ఇంటిలో ఫోన్ గురువారం మధ్యాహ్నం నుంచి మోగుతూనే ఉన్నది. 'నా ఫోన్ ఉదయం నుంచి మోగుతూనే ఉన్నది. మా ఇరుగుపొరుగు ఇళ్ళవారు, స్నేహితులు, కుటుంబ సభ్యులు అందరూ చాలా సంతోషంతో ఉన్నారు. బాణసంచా కాలుస్తున్నారు. ఇది దీపావళి కానుకే. నా తల్లిదండ్రులు ఎంతగానో ఆనందిస్తున్నారు' అని అతను తెలియజేశాడు.
ఆస్ట్రేలియన్లపై ఆడే అవకాశం గురించి త్యాగి మాట్లాడుతూ, 'నేను కొంత ఒత్తిడి ఎదుర్కొంటున్నాను. కాని నా శక్తి మేరకు బౌల్ చేయగలను. ఈ సవాల్ కు నేను సిద్ధంగా ఉన్నాను' అని చెప్పాడు.
Pages: -1- 2 News Posted: 16 October, 2009
|