ఆ క్రికెటర్ టెర్రరిస్టు కాదు! అయితే, కర్నాటక పోలీసులు తమకు అందిన ప్రాథమిక సమాచారం ఆధారంగా క్రికెటర్ పర్వేజ్ రసూల్‌ను ప్రశ్నించడానికి తీసుకువెళ్ళారే తప్ప అరెస్టు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. “రాష్ట్ర క్రికెట్ జట్టు వివిధ స్థాయిలలో ఆడి, ప్రతిభ ప్రదర్శించడం ఇష్టం లేని సంకుచిత శక్తులు కొన్ని జమ్ము నుంచి బెంగళూరు పోలీసులకు ఫోన్ చేసి ఆ క్రికెటర్ కొన్ని పేలుడు వస్తువులు వెంట తీసుకువెళుతున్నట్లుగా తెలియజేశారు’ అని డాక్టర్ ఫరూక్ చెప్పారు. తాను జమ్ము కాశ్మీర్ పోలీస్ డైరెక్టర్ జనరల్ (డిజిపి)తోను, బెంగళూరు పోలీసులతోను మాట్లాడానని, కుట్రదారుల ఆచూకీ త్వరలోనే తీయగలరని ఆయన చెప్పారు.
“జట్టు ప్రతిష్ఠను దెబ్బ తీయడానికి కుట్రదారులు ప్రయత్నించారు. అయితే, వారిపై తగు చర్యలు తీసుకోగలరు’ అని ఆయన పేర్కొన్నారు. “బెంగళూరు పోలీసులు తమ విధి నిర్వర్తించారు. ఫోన్ కాన్ అందుకొన్న మీదట వారు క్రికెటర్‌ను ప్రశ్నించారు. అవాంఛనీయ సంఘటన ఏదీ జరగకుండా నివారించడానికి వారు కృషి చేశారు’ అని డాక్టర్ ఫరూక్ చెప్పారు. తమకు అందిన నిర్దుష్ట సమాచారం మేరకు బెంగళూరు పోలీసులు జమ్ము కాశ్మీర్ అండర్ 22 జట్టు సభ్యుడు రసూల్‌ను ప్రశ్నించారు. జెకెసిఎ అండర్ 22 జట్టు సికె నాయుడు ట్రోఫీ కోసం ఈ నెల 21న కర్నాటకతో ఆడిన తరువాత ఢిల్లీ, ముంబైలలో మరి రెండు మ్యాచ్‌లలో పాల్గొంటుంది.
Pages: -1- 2 News Posted: 19 October, 2009
|