ఐపిఎల్ జట్లకు టైమేదీ?
చాంపియన్స్ లీగ్ కు ఐపిఎల్ జట్లు సన్నద్ధమైన సూచనలు ఎందుకు కనిపించలేదో ఇది వివరిస్తున్నది. అగ్ర శ్రేణి క్రీడాకారులు చాలా మందికి టి20 టోర్నీ కోసం వ్యూహరచన చేయడానికి, సన్నద్ధం కావడానికి తగినంత వ్యవధి లభించలేదు. అంతేకాకుండా డేనియల్ వెట్టోరి, ఎ.బి. డివిలీర్స్ వంటి కీలక క్రీడాకారులు గాయపడడం కూడా డేర్ డెవిల్స్ జట్టు అవకాశాలకు విఘాతం కలిగించింది. ఇది ఇలా ఉండగా, ఆర్ సిబి బౌలింగ్ బలహీనంగా ఉంది.దక్కన్ చార్జర్స్ జట్టు కెప్టెన్ ఆడమ్ గిల్ క్రైస్ట్, ఆండ్రూ సైమండ్స్ వంటి కొందరు క్రీడాకారులపై అధికంగా ఆధారపడింది. మరొక కారణమేమంటే ఐపిఎల్ జట్లలోని కొందరు ప్రముఖ క్రీడాకారులు తమ దేశ జట్లకు ఆడడానికి సిద్ధపడడం. పర్యవసానంగా ఐపిఎల్ జట్లు బలహీనపడ్డాయి. దీనితో ఈ జట్లు స్వదేశంలో ఆడుతున్నా ఫలితం లేకపోయింది.
కాగా, ఐపిఎల్ జట్లు పేలవంగా ఆడడం విదేశీ జట్లను ఆశ్చర్యపరిచింది. 'ఇది ఎంతో విస్మయం కలిగించింది. మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఇలా జరుగుతుందని ఊహించను కూడా లేదు' అని కేప్ కోబ్రాస్ బ్యాట్స్ మన్ జీన్ పాల్ డూమినీ చెప్పాడు. అయితే, 'ఇతర జట్లను కూడా ప్రశంసించవలసి ఉంటుంది. అవి ఈ టోర్నమెంట్ లో చక్కని ఫామ్ కనబరిచాయి' అని అతను పేర్కొన్నాడు. కాగా, 'ఐపిఎల్ జట్లు స్వదేశంలో ఫేవరైట్లు కాగలవని మేము భావించాం. అందువల్ల వాటి వైఫల్యం ఆశ్చర్యం కలిగించింది. అయితే, ఏ ఒక్కరూ నిజంగా ఫేవరైట్ కారనడానికి టి20 గేమే సూచిక. అధిక సంఖ్యలో వీక్షకులు రావడంతో భారతీయ జట్లపై ఒత్తిడి మరింత పెరిగింది' అని కేప్ కోబ్రాస్ జట్టు కోచ్ షుక్రీ కాన్రాడ్ పేర్కొన్నారు.
Pages: -1- 2 News Posted: 20 October, 2009
|