మళ్లీ నింబస్ కే హక్కులు
నింబస్ సంస్థ నాలుగు సంవత్సరాలలో టెలివిజన్ ప్రసారాల కోసం 2006లో బిసిసిఐతో రూ. 2755 కోట్ల మేరకు ఒప్పందం కుదుర్చుకున్నది. ఒక సంవత్సరం తరువాత దూరదర్శన్ తో ప్రత్యక్ష ప్రసారాలను పంచుకోవడం, సంకేత సంక్షిప్త సందేశం (ఎన్ క్రిప్షన్) విషయమై నింబస్, బిసిసిఐ మధ్య సంబంధాలు సంక్షోభంలో పడ్డాయి. జాతీయ ప్రసార సంస్థ దూరదర్శన్ తో క్రీడా ప్రసారాలను పంచుకోవడాన్ని తప్పనిసరి చేస్తూ 2007 మార్చిలో చేసిన ఒక చట్టం వల్ల నింబస్ సంస్థ గణనీయంగా ఆదాయాన్ని నష్టపోయింది. 'ఆ నిబంధన కారణంగా ఒక్క 2006 - 07 సంవత్సరంలోనే నింబస్ రూ. 140 కోట్లు, రూ. 150 కోట్లు మధ్య నష్టానికి గురైంది' అని నింబస్ ప్రతినిధి ఒకరు తెలియజేశారు.
అయితే, బిసిసిఐలో శక్తిమంతులైన కొందరు మిత్రుల సాయంతో నింబస్ తన రెవెన్యూ నష్టాలలో కొంత భాగాన్ని క్రికెట్ బోర్డుకు బదలాయించగలిగింది. ఫలితంగా మొత్తం నష్టాలలో రూ. 257 కోట్ల మేరకు నింబస్ కు బిసిసిఐ పరిహారం చేసింది. 2007లో కొన్ని పోటీల రద్దుతో దాదాపు రూ. 200 కోట్ల మేరకు నష్టాలను కూడా నింబస్ తగ్గించుకోగలిగింది. అటుపిమ్మట, వివిధ దశలలో నింబస్ సంస్థకు మరిన్ని రాయితీలు లభించాయి. బిసిసిఐకి సంస్థ చెల్లించే మొత్తం మ్యాచ్ ఫీజు తగ్గింది.
గత కాంట్రాక్టులో వలె కొత్త ఒప్పందంలో కూడా దేశీయ క్రికెట్ కు చెప్పుకోదగిన ప్రాముఖ్యం లభించింది. మొదటి సంవత్సరం కనీసం 52 రోజుల పాటు, రెండవ, మూడవ, నాలుగవ సంవత్సరాలలో 72 రోజులు వంతున పోటీలను నింబస్ ప్రత్యక్ష ప్రసారం చేయవలసి ఉంటుంది.
Pages: -1- 2 News Posted: 22 October, 2009
|