సచిన్ తో ఒక్క రోజు! జీవితంలో ఒకసారి మాత్రమే లభించే ఈ అరుదైన అవకాశాన్ని చేజిక్కుంచుకునేందుకు ఆఖరి క్షణం వరకు బిడ్డర్లు హోరాహోరీగా తమ పాటను పెంచుకుంటూ పోయారు. చివరకు 6 లక్షల రూపాయల వద్ద వర్ల్ పూల్ కంపెనీకి చెందిన ఉద్యోగి, మరో ఇద్దరు దాతల మధ్య ప్రతిష్టంభన ఏర్పడింది. తమ కంపెనీలో అసమాన ప్రతిభా పాటవాలను ప్రదర్శించే ఉత్తమ ఉద్యోగికి ఈ మహదావకాశాన్ని కల్పించే ఉద్దేశంతో వర్ల్ పూల్ కంపెనీ వేలంలో పాల్గొనగా, సమాజంలో అణగారిపోయిన వర్గాలకు చెందిన పిల్లలకు కొత్త జీవితం ప్రసాదించాలన్న మహోద్దేశంతో మిగిలిన దాతులు ఇద్దరు వేలంలో పాల్గొన్నారు. మొత్తం మీద ఈ ముగ్గురు తమ బిడ్ మొత్తాన్ని కలిపి 12 లక్షల రూపాయలు ఆఫర్ చేయడానికి ముందుకు రావడంతో వారి ముగ్గురికి కూడా కోచింగ్ ఇవ్వడానికి సచిన్ టెండూల్కర్ అంగీకరించాడు.
వేలం విజేతలు ముగ్గురికి సచిన్ తో వన్డే క్యాంప్ ఉదయం 9 గంటలకు ప్రారంభం అవుతుంది. మూడు గంటలపాటు ఏకబిగిన సాగే ఈ కోచింగ్ కార్యక్రమం అనంతరం విజేతులు ముగ్గురు సచిన్ తో కలసి లంచ్ చేస్తారు. కోచింగ్ లో భాగంగా బాటింగ్ లో మెళుకువలు, ఫిట్ నెస్ పై చిట్కాలు, రోటీన్ గా రోజూ ప్రాక్టీస్ ఏ విధంగా చేయాలి, మాచ్ ఆడటానికి ఎలా సంసిద్ధులు కావాలి వంటి అంశాలతోపాటు ఆడేటపుడు మానసికంగా ఎంత నిబ్బరంగా ఉండాలో కూడా ఈ క్యాంప్ లో సచిన్ వేలం విజేతలకు బోధిస్తారు.
Pages: -1- 2 News Posted: 23 October, 2009
|