టాప్ ర్యాంకుపై ఇండియా కన్ను
ఆస్ట్రేలియా కనుక నంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి సీరీస్ ను గెలుచుకోవలసిన అవసరం ఉంటుంది. ఆసీస్ జట్టు 4-3తో సీరీస్ గెలుచుకున్నట్లయితే, రెండు జట్లు సీరీస్ ముందు స్థానాలలో కొనసాగుతాయి. అదే ఆసీస్ 5-2 విజయాన్ని లేదా ఇంకా మెరుగైన ఫలితాన్ని సాధించినట్లయితే టాప్ లో తన స్థానాన్ని దృఢం చేసుకుంటుంది. ఆసీస్ 6-1 లేదా 7-0తో సీరీస్ గెలుచుకున్న పక్షంలో ఆతిథేయ జట్టు ఇండియా ఈ పట్టికలో దక్షిణాఫ్రికా తరువాత మూడవ స్థానానికి పడిపోతుంది. 6-1తో సీరీస్ ఓటమి వల్ల ఇండియా రేటింగ్ పాయింట్లు 119కి తగ్గిపోతాయి. ఇక సీరీస్ లో ఒక్క పోటీలో కూడా నెగ్గలేకపోయినట్లయితే, ఇండియా ఎనిమిది రేటింగ్ పాయింట్లను నష్టపోతుంది.
ఇది ఇలా ఉండగా, ఒడిఐ బ్యాట్స్ మన్ ల ర్యాంకింగ్ లలో అగ్ర స్థానంలో మహేంద్ర సింగ్ ధోని కొనసాగుతున్నాడు. జట్టు వైస్ కెప్టెన్ యువరాజ్ సింగ్ పాయింట్లలో బాగా వెనుకబడి రెండవ స్థానంలో ఉన్నాడు. జనవరి 31న శ్రీలంకలో మొదటి ఒడిఐ అనంతరం వెస్టిండీస్ కెప్టెన్ క్రిస్ గేల్ నుంచి నంబర్ వన్ స్థానాన్ని చేజిక్కించుకున్నప్పటి నుంచి ధోని అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ పట్టికలో టాప్ 20లో ధోని, యువరాజ్ కాకుండా ఇండియా నుంచి ఇంకా సచిన్ టెండూల్కర్ (9), వీరేంద్ర సెహ్వాగ్ (10), ఐసిసి టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ గౌతమ్ గంభీర్ (16) కూడా ఉన్నారు.
ఆస్ట్రేలియా వైస్ కెప్టెన్ మైక్ హుస్సీ ఐదవ స్థానంతో తన జట్టులో అత్యధిక ర్యాంక్ బ్యాట్స్ మన్ గా ఉన్నాడు. రెండవ స్థానంలో ఉన్న యువరాజ్ కు, హుస్సీకి మధ్య ఉన్న తేడా 12 పాయింట్లు మాత్రమే. టాప్ 20లో ఉన్న మరొక ఆస్ట్రేలియన్ బ్యాట్స్ మన్ పాంటింగ్ (8) మాత్రమే. కాగా, ఐసిసి క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ మిచెల్ జాన్సన్ 11వ స్థానంతో రెండు జట్లలోను అత్యధిక ర్యాంకు బౌలర్ గా ఉన్నాడు. రెండు జట్ల బౌలర్లలో టాప్ 20లో ఉన్న మరి ఇద్దరు బ్రెట్ లీ (16), హర్భజన్ సింగ్ (18) మాత్రమే. టాప్ 20, టాప్ 40 మధ్య ఉన్న రెండు జట్లలోని ఇతర బౌలర్లలో జేమ్స్ హోప్స్ (21), ప్రవీణ్ కుమార్ (25), ఇశాంత్ శర్మ (34), నాథన్ హారిట్జ్ (37), షేన్ వాట్సన్ (40) ఉన్నారు.
Pages: -1- 2 News Posted: 24 October, 2009
|