ఆరేళ్లలో నాలుగు సార్లు...
ప్రపంచ క్రికెట్ ప్రధాన స్తంభాలుగా పేర్కొనదగిన ఆస్ట్రేలియా, ఇండియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ మరింత తరచుగా పరస్పరం ఆడేట్లు చూడడం ఈ పథకం లక్ష్యం. 2012 నుంచి ఈ కొత్త అంతర్జాతీయ పోటీల కార్యక్రమం అమలులోకి వస్తుంది. దక్షిణాఫ్రికా కూడా తమ టెస్ట్, పరిమిత ఓవర్ల పోటీల పర్యటనలను విభజించడానికి అంగీకరించింది.
'అభిమానులకు మరింత ప్రయోజనం కలిగే విధంగా పర్యటించే జట్ల ప్రమాణాన్ని విస్తరించడమే ధ్యేయం. మేము అనుకున్నది జరిగితే, తదుపరి ఎఫ్ టిపి వ్యవధిలో ఆరేళ్లలో నాలుగు సార్లు ఇండియాకు ఇక్కడ ఆతిథ్యం ఇస్తాం' అని క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ) అధికార ప్రతినిధి పీటర్ యంగ్ తెలియజేశారు.
ఇండియాకు ఆస్ట్రేలియా మరింత ఎక్కువగా ఆతిథ్యం ఇవ్వడంలో మరొక అంతరార్థం కూడా ఉన్నది. ఉపఖండంలో క్రికెట్ ఆట అంటే ప్రాణమిచ్చే అభిమానులు ఉన్న కారణంగా ఏషెస్ టూర్ వల్ల లభించే టెలివిజన్ ఆదాయం కన్నా అధికంగా భారత క్రీడాకారులు పర్యటించినప్పుడు సిఎకు టివి హక్కుల ద్వారా లాభం చేకూరుతుంది.
అయితే, ఈ 'నాలుగు అగ్ర' దేశాల మధ్య ఈ ఒప్పందం కుదరడం లాభాలలో తమ వాటా కోసం చూస్తుండే క్రికెట్ ఆడే చిన్న దేశాలకు ఆగ్రహం కలిగించవచ్చు. అంతేకాదు. ఈ సీజన్ లో తమ దేశానికి వెస్టిండీస్, పాకిస్తాన్ జట్లు వచ్చినప్పుడు ఆ పోటీలపై ఆస్ట్రేలియన్ ప్రజలకు ఆసక్తి కలిగేట్లుచూడడం సిఎకు గగన ప్రాయమే అవుతుందని, మున్ముందు వేసవి కాలాలలో 'అగ్ర శ్రేణి' జట్టును రప్పించాలని సిఎ పట్టుదలతో ఉన్నదని ఆ పత్రిక తెలియజేసింది.
Pages: -1- 2 News Posted: 24 October, 2009
|