ఆసియా కప్ టి 20లో పాక్?
పాకిస్తాన్ మాజీ ఆల్ రౌండర్ అబ్దుల్ రజాక్ ను ఇప్పటికే ఆ దేశపు డబ్ల్యుఎఫ్ఎల్ జట్టు అధిపతిగా ప్రకటించారు. న్యూజిలాండ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ క్రిస్ కెయిర్న్స్ డబ్ల్యుఎఫ్ఎల్ బ్రాండ్ అంబాసడర్ గాను, డబ్ల్యుఎఫ్ఎల్ యుఎఇ జట్టు అధిపతిగాను ఉన్నారు. బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ హబీబుల్ బాషర్ డబ్ల్యుఎఫ్ఎల్ బంగ్లాదేశ్ జట్టు అధిపతి కాగా హసన్ తిలకరత్నె డబ్ల్యుఎఫ్ఎల్ శ్రీలంక జట్టుకు అధిపతి. డబ్ల్యుఎఫ్ఎల్ టీమ్ ఇండియాకు అధిపతి స్టువార్ట్ బిన్నీ.
పాకిస్తానీ క్రికెటర్లకు కేంద్రం నుంచి ఇంకా అనుమతి రావలసి ఉన్నప్పటికీ డబ్ల్యుఎఫ్ఎల్ ఐదు క్రికెట్ జట్లు - ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, యుఎఇలకు వేలంపాటను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నది. నవంబర్ 16న హైదరాబాద్ లోని హోటల్ తాజ్ కృష్ణలో టైటిల్ స్పాన్సర్ షిప్ తో పాటు ఈ జట్ల కోసం వేలం నిర్వహించనున్నారు. ఇందుకు బిడ్ ల గడువు నవంబర్ 13న ముగుస్తుంది. కాగా, 'ఐసిఎల్, ఐపిఎల్, ఇపిఎల్, కెపిఎల్'లకు డబ్ల్యుఎఫ్ఎల్ పోటీ కాదని రెగో స్పష్టం చేశారు.
Pages: -1- 2 News Posted: 28 October, 2009
|