'కోట్లా'(ట)లో భారత్ గెలుపు ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ లో ఒపెనింగ్ బ్యాట్స్ మెన్ గా బరిలోకి వచ్చిన షేన్ వాట్సన్, కెప్టెన్ రికీ పాంటింగ్ 16.2వ ఓవర్ వరకూ నిలకడగా ఆడి జట్టుకు గట్టి పునాది వేశారు. అయితే, 16.2వ ఓవర్ లో యువరాజ్ సింగ్ వేసిన బంతికి వాట్సన్ తడబడడంతో వికెట్ల వెనుక కాచుక్కూర్చున్న కెప్టెన్ కమ్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ వెంటనే స్టంప్ అవుట్ చేశాడు. ఒన్ డౌన్ లో తనకు తోడుగా వచ్చిన మేఖేల్ హస్సేతో ఆసీస్ కెప్టెన్ రికీ పాంటింగ్ చక్కని అవగాహనతో ఆడి స్కోరును 128 పరుగులకు చేర్చాడు. అప్పటికి ఆట 31.1వ ఓవర్ నడుస్తోంది. ఆ సమయంలో రవీంద్ర జడేజా బంతికి పాంటింగ్ ఎల్ బిడబ్ల్యు అయ్యాడు. అప్పటికి పాంటింగ్ వ్యక్తిగత స్కోరు 59 పరుగులు.
పాంటింగ్ పెవిలియన్ చేరిన తరువాత క్రీజ్ వద్దకు వచ్చిన ముగ్గురు బ్యాట్స్ మెన్ కామెరూన్ వైట్ (పరుగులేవీ చేయలేదు), ఆదం వోగ్స్ (17), మోజెస్ హెన్రిక్స్ (12) తక్కువ పరుగులకే వెనుదిరిగి వెళ్ళిపోయీనా హస్సే మాత్రం నిగ్రహం చెడకుండా నిబ్బరంగా వికెట్లను అంటిపెట్టుకొని పరుగులు తీశాడు. నాటౌట్ బ్యాట్స్ మన్ గా నిలిచాడు. ఆట చివరి మూడు ఓవర్లలో మిట్చెల్ జాన్సన్ హస్సేకు తోడుగా నిలిచాడు. జాన్సన్ 12 బంతులు ఎదుర్కొని 9 పరుగులతో నాటౌట్ బ్యాట్స్ మన్ గా ఉన్నాడు. భారత బౌలింగ్ లో రవీంద్ర జడేజా 2 వికెట్లు పడగొట్టాడు. హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్, సురేష్ రైనా తలో వికెట్ తీసుకున్నారు.
Pages: -1- 2 News Posted: 31 October, 2009
|