దీపిక-రణ్ బీర్ కటీఫ్?
రణ్ బీర్, కత్రినా కలిసి 'రాజ్ నీతి' చిత్రం షూటింగ్ కోసం భోపాల్ లో ఉన్నప్పుడు సెట్స్ లోకి అడుగుపెట్టిన దీపిక అక్కడే సుమారు రెండు వారాలు ఉండిపోయింది. భోపాల్ నుంచి ఆమె తిరిగివచ్చిన వచ్చిన తర్వాత రణ్ బీర్ కు దాదాపు చెక్ పెట్టేసింది. రెండు వారాల క్రితమే జరిగిన షబీనా ఖాన్ బర్త్ డే పార్టీలో ఎడమొగం పెడమొగంగానే ఉన్నారు. ఒకే రూమ్ లో కూర్చొన్నప్పటికీ ఎవరి దారి వారిదే కావడంతో ఈ ఇద్దరూ విడిపోయారనే స్పష్టమైన సంకేతాలనిచ్చింది. దీపికతో మంచి అనుబంధం ఉన్న రణ్ బీర్ తల్లి నీతూసింగ్ సంగతేమిటి? రణ్ బీర్ సంతోషంగా ఉండాలన్నదే ఆమె కోరికనీ, అతని కోరికకు విరుద్ధంగా ఏరోజూ ఆమె ప్రవర్తించదనీ ఆమె సన్నిహత వర్గాలు చెబుతున్నాయి. దీపకను ఎప్పుడూ ఓ గాళ్ ఫ్రెండ్ గానే రణ్ బీర్ భావిస్తూ వచ్చాడనీ, అంతకంటే ప్రత్యేకంగా ఆమెను ఎప్పుడూ అనుకోలేదనీ, అంతకుమించి వారి అనుబంధం గురించి చెప్పుకునేందుకు కూడా ఏమీ లేదనీ ఆ వర్గాలు అంటున్నాయి.
Pages: -1- 2 News Posted: 4 November, 2009
|