భారత్ పోరాడి ఓడింది ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనలో భాగంగా జరుగుతున్న ఏడు వన్డేల సీరీస్ లో ఈ ఐదవ వన్డే కీలకంగా మారింది. ఈ వన్డేలో గెలవకపోతే తదుపరి ఆరు, ఏడు మ్యాచ్ లలో విజయం కోసం వత్తిడితో ఆడాల్సి ఉంటుంది. గాయాల బాధతో మెరికల్లాంటి క్రీడాకారులను దూరంగా ఉంచి మూడు మార్పులతో బరిలో దిగిన ఆస్ట్రేలియా ఆ బాధను ఏమాత్రం కనబర్చకుండా స్టేడియంలో చెలరేగి ఆడింది. తమ ఇన్నింగ్స్ మొత్తంలో 23 బౌండరీలు, 13 సిక్సర్లు కొట్టిన ఆసీస్ బ్యాట్స్ మెన్ క్రికెట్ రుచి ఏమిటో చూపించారు. ఆట ప్రారంభమై 25 ఓవర్ల వరకూ ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ ను కట్టడి చేయలేక భారత బౌలర్లు, ఫీల్డర్లు ఉక్కిరిబిక్కిరయ్యారు. మొత్తానికి నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 350 పరుగుల భారీ స్కోరు చేసి టీమిండియాకు పట్టపగలే చుక్కలు చూపించారు.షాన్ మార్ష్ అంతర్జీతీయ వన్డేల్లో తొలి సెంచరీ పూర్తి చేసి తన వ్యక్తిగత స్కోర్ 112 వద్ద గౌతం గంభీర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. వాట్సన్ 93 పరుగులు చేశాడు. మొత్తం 45 బంతులు ఆడిన పాంటింగ్ 45 పరుగులు చేశాడు.
భారీ లక్ష్యాన్ని చేధించడానికి బరిలోకి దిగిన భారత్ జోరుగానే బ్యాటింగ్ చేసింది. కాని తొమ్మిదో ఓవర్లో స్కోరు 66 వద్ద ఉండగా సెహ్వాగ్ 38 వ్యక్తిగత పరుగులకే అవుట్ అయ్యాడు. తరువాత సురేష్ రైనా(59)కలిసి సచిన్ ఐదో వికెట్ కు 137 కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. మహేంద్ర సింగ్ ధోనీ ఆరు పరుగులకే ఔటయ్యాడు. రవీంద్ర జడేజా 23 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియాపై ఎప్పుడూ మంచి స్కోర్లు చేసే హర్భజన్ సింగ్ ఈ మ్యాచ్ లో డకౌట్ అయ్యాడు.
Pages: -1- 2 News Posted: 5 November, 2009
|