'మమ్మీకి ఆ సీన్ చూపొద్దు'
ఈనెల 12న యష్ రాజ్ స్టూడియోస్ లో చిత్ర నటీనటులు, సాంకేతిక నిపుణుల కోసం 'కుర్బాన్' ప్రీమియర్ ను ప్రదర్శిచారు. కరీనా మాత్రం ఎంతో నెర్వస్ గా ఫీలవుతూ వచ్చింది. తాను వీపునగ్నంగా చూపిన సన్నివేశాన్ని ఈ ఒక్క షో కోసమైనా తొలగించాల్సిందిగా కరణ్ జోహర్ ను బతిమాలుకుంది. కరీనా తల్లి బబిత, ఆమె మిత్రులు ఈ ప్రీమియర్ కు హాజరవుతుండటమే ఇందుకు కారణం. 'అమ్మకు చూపించే ట్రయిలర్ లో మాత్రం ఆ ఒక్కరీల్ ను లేకుండా చూడమని కరణ్ ను కోరాను' అని కరీనా ఒప్పుకుంది. అయితే కరీనా భయాలన్నీ అర్ధం లేనివంటూ కరణ్ తోసిపుచ్చారట. 'షటప్ బెబో..మాట్లాడకుండా వెళ్లు. అలాంటి పనులు నేను చేయను' అని ఆయన సీరియస్ గానే అన్నట్టు సమాచారం. నిజానికి ఈ ప్రీమియర్ వ్యవహారం జరుగుతున్న సమయంలో కరీనా సిడ్నీలో కరణ్ జోహర్ 'స్టెప్ మదర్' చిత్రం కోసం కాజోల్ తో కలిసి షూటింగ్ లో పాల్గొంటోంది. కరీనా సీడ్నీ వెళ్లేందుకు విమానం ఎక్కేంతవరకూ 'కుర్బాన్' సన్నివేశం చూసి తన కుటుంబ సభ్యులు ఏమనుకుంటారోననే ఆలోచనతోనే కరీనా గడిపిందంటూ ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ప్రస్తుతం ఎలాగూ ముంబైకి దూరంగా ఆమె సిడ్నీలో ఉంది కాబట్టి ఎవరేమంటారోనన్న భయం నుంచి కరీనా బయటపడొచ్చు...
Pages: -1- 2 News Posted: 17 November, 2009
|