'యునీక్' ఖర్చు 3వేల కోట్లు యుఐడి లక్ష్యం : ఇది గుర్తింపునకు గ్యారంటీ మాత్రమే. ఏ హక్కులూ, ప్రయోజనాలూ, లేదా అర్హతలూ దీని వల్ల దత్తం కావు. ఇది పౌరసత్వాన్ని కూడా దత్తం చేయదు. అయితే, బ్యాంకు ఖాతా ప్రారంభించడానికి గాని, పాస్ పోర్ట్ కోసం లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేదా అటువంటి ఇతర సేవల కోసం దరఖాస్తు చేయడానికి గాని ప్రతిసారి గుర్తింపు పత్రాలను సమర్పించవలసిన బాధ ప్రజలకు దీని వల్ల తప్పుతుంది. సర్వీస్ ప్రొవైడర్లు అందరూ దీనిని గుర్తింపు నిర్థారణ పత్రంగా ఆమోదిస్తారు.
ఖర్చు : యుఐడి నంబర్ల కోసం వివరాల నమోదుకు పౌరుల నుంచి ఎటువంటి చార్జీనీ వసూలు చేయరు.
తప్పనిసరా? : కాదు. కాని యుఐడి నంబర్ పొందడమనేది డిమాండ్ బట్టి ఉంటుందని ప్రాధికార సంస్థ భావిస్తున్నది. ఈ నంబర్ తో ముడిపడి ఉన్న ప్రయోజనాలు, సేవల వల్ల దీనికి డిమాండ్ ఉంటుందని సంస్థ భావిస్తున్నది. చివరకు స్కూల్స్ కూడా పిల్లలను చేర్చుకునే ముందు వారి యుఐడిని కోరతాయి.
ఐడి కార్డు, రిజిస్ట్రార్లు: ప్రాధికార సంస్థ ఎటువంటి కార్డులనూ జారీ చేయదు. అయితే, రిజిస్ట్రార్లకు నిర్దుష్ట చార్జీకి యుఐడి కార్డులను జారీ చేసే అవకాశం ఉంటుంది. రిజిస్ట్రార్లలో రాష్ట్ర ప్రభుత్వాలు లేదా పౌరుల వివరాలు నమోదు చేసుకునే ఆయిల్ మంత్రిత్వశాఖ లేదా భారత జీవిత బీమా సంస్థ (ఎల్ఐసి) వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు భాగంగా ఉంటాయి. చార్జీని ప్రాధికార సంస్థ నిర్ణయిస్తుంది. బ్యాంకులు, బీమా సంస్థలు వంటి ప్రైవేట్ రంగ సంస్థలు కూడా రిజిస్ట్రార్లు కావచ్చు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ, మునిసిపాలిటీలు రాష్ట్ర ప్రభుత్వ రిజిస్ట్రార్లకు సబ్ రిజిస్ట్రార్లుగా ఉంటాయి.
వివరాలు నమోదు చేసుకునే ఏజెన్సీలు : వివరాలు నమోదు చేసుకునే ఏజెన్సీల ద్వారా కూడా రిజిస్ట్రార్లు పౌరుల వివరాల సేకరణకు అవకాశం కల్పిస్తారు. ఉదాహరణకు, ఒక శిశువు జన్మించిన ఆసుపత్రిని ఆ శిశువు ఐడి కోసం వివరాలు నమోదు చేసుకునే ఏజెన్సీగా ఉండగలదు. అది మునిసిపాలిటీ సబ్ రిజిస్ట్రార్లకు ఈ సమాచారం అందజేస్తుంది. వివరాల నమోదుకు ముందు శిశువుకు తప్పని సరిగా నామకరణం చేయవలసి ఉంటుంది. బర్త్ సర్టిఫికెట్లలో యుఐడి నంబర్ ఉంటుంది. వివరాలు నమోదు చేసుకునే ఏజెన్సీలు ఒక వ్యక్తి సమాచారాన్ని సేకరించి, 'మీ ప్రాంత నివాసి గురించి తెలుసుకోండి' అనే ప్రమాణాల ప్రాతిపదికపై సమర్థన పత్రాలను పరీక్షించగలవు. పేదలు లేదా సన్నకారు వర్గాల కోసం డాక్యుమెంట్ల నిబంధనలను సడలించవచ్చు లేదా అవి భిన్నంగా ఉండవచ్చు.
Pages: -1- 2 -3- -4- News Posted: 18 November, 2009
|