'యునీక్' ఖర్చు 3వేల కోట్లు వివరాల నమోదు పర్యవేక్షణ : జిల్లాల వరకు కూడా వివరాల నమోదు విధానాన్ని పర్యవేక్షించడానికి ప్రాధికార సంస్థ ఇంటర్నెట్ ఆధారిత జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (జిఐఎస్)ను ఉపయోగిస్తుంది.
కాలవ్యవధి : ప్రాధికార సంస్థ 12 నుంచి 18 నెలల్లో యుఐడిలను జారీ చేయనారంభిస్తుంది. నాలుగేళ్ళలో 60 కోట్ల మందికి, ఆతరువాత ఆరేళ్ళలో దాదాపు మొత్తం జనాభాకు వీటిని జారీ చేయాలని సంస్థ లక్ష్యం.
మరణాల నమోదు : ఎవరైనా వ్యక్తి మరణించిన తరువాత యుఐడి సిస్టమ్ లో ఆ రికార్డును తొలగించరు. కాని 'మరణించారు' అని మాత్రమే పేర్కొంటారు. ఇక అది గుర్తింపు అవసరాలకు ఉపయోగపడదు.
వివిధ ప్రభుత్వ పథకాల కింద డూప్లికేషన్ ను తొలగించడం వల్ల ప్రభుత్వ ఖజానాకు ఏడాదికి రూ. 20 వేల కోట్లకు పైగా ఆదా కావచ్చునని ప్రాధికార సంస్థ చెబుతున్నది. ఇంత బృహత్ స్థాయిలో బయోమెట్రిక్ ఆధారిత యుఐడి విధానాన్ని అమలు పరుస్తున్న తొలి దేశం ఇండియాయే.
Pages: -1- -2- -3- 4 News Posted: 18 November, 2009
|