'యునీక్' ఖర్చు 3వేల కోట్లు ఐడి నిక్షేపం (రిపాజిటరీ) : కేంద్రీకృత ఐడి డేటా నిక్షేపం (రిపాజిటరీ)ని నిర్వహించే రెగ్యులేటరీ సంస్థగా ఈ అథారిటీ ఉంటుంది. వివరాలు నమోదు చేసుకునే ఏజెన్సీలు డెమోగ్రాఫిక్, బయోమెట్రిక్ సమాచారాన్ని ఈ రిపాజిటరీకి పంపిన తరువాత ఒక విలక్షణ ఐడి నంబర్ ను ఆ ఏజెన్సీలకు పంపుతారు. అవి ఆ నంబర్ ను 2డి బార్ కోడ్ తో సహా వివరాలతో పౌరునికి ఇస్తాయి.
విలక్షణతను సాధించడం : రెండవసారి వివరాల నమోదు (డూప్లికేషన్) జరగకుండా చూడడానికై డేటాబేస్ ఆధారంగా కీలక రంగాలు, వేలిముద్రలకు సంబంధించి ప్రతి పౌరుని డేటాను సరిచూస్తారు.
తాజా సమాచారం: యుఐడి నంబర్ జీవితకాలం ఒకేవిధంగా ఉంటుంది. కాని బయోమెట్రిక్ సమాచారాన్ని పిల్లల విషయంలో ప్రతి ఐదేళ్ళకు, వయోజనుల విషయంలో ప్రతి పదేళ్ళకు తాజాగా (అప్ డేట్) చేస్తుంటారు. చిరునామా మార్పు, పేరు మార్పు (వివాహానంతరం) వంటి డెమోగ్రాఫిక్ సమాచారాన్నికూడా అప్ డేట్ చేస్తుంటారు.
ధ్రువీకరణ, ప్రైవసీ : ప్రాధికార సంస్థ ఆన్ లైన్ ధ్రువీకరణకు అవకాశం కల్పిస్తుంది. ఇందులో ఏజెన్సీలు కేంద్రీకృత డేటా బేస్ లోని వివరాలతో డెమోగ్రాఫిక్, బయోమెట్రిక్ సమాచారాన్ని పోల్చి చూడవచ్చు. ఎవరైనా ఒక పౌరునికి సంబంధించిన డేటాను ధ్రువీకరిస్తున్నప్పుడు, సమాచారాన్ని అందజేయరు. కాని, 'అవును' అని గాని 'కాదు' అని గాని సమాధానం మాత్రమే ఇస్తారు. పౌరుల ప్రైవసీని కాపాడడానికి అనేక స్థాయిలలో టెక్నాలజీ రక్షణ సౌకర్యాలను కల్పించారు. యుఐడి నంబర్, పేరు, జన్మ తేదీ వంటి ప్రాథమిక గుర్తింపు సమాచారాన్ని ఉచితంగా నిర్థారించుకోవచ్చు. కాని చిరునామా నిర్థారణకు రూ. 5 వెచ్చించవలసి ఉంటుంది. ఫోటోగ్రాఫ్ లేదా వేలిముద్ర వంటి బయోమెట్రిక్ నిర్థారణకు రూ. 10 చార్జి వసూలు చేస్తారు. బయోమెట్రిక్ నిర్థారణను సాధారణంగా క్రెడిట్ కార్డు, ఆర్థిక సంస్థలు చేయవచ్చు. చార్జీకి నిర్థారణ విధానం ద్వారా సాలీనా రూ. 288 కోట్లు ఆర్జించవచ్చునని ప్రాధికార సంస్థ ఆశిస్తున్నది.
ద్విభాషా సూత్రం : వివరాలు నమోదు చేసుకునే ఏజెన్సీలు ఇంగ్లీషులోనే మొత్తం డేటాను నమోదు చేస్తాయి. అయితే, భాషాంతరీకరణ (ట్రాన్స్ లిటరేషన్) సాఫ్ట్ వేర్ ను ఉపయోగించి ఈ సమాచారాన్ని స్థానిక భాషలోకి మార్చవచ్చు. పౌరులకు పంపే సమాచారం అంటే డెమోగ్రాఫిక్ డేటా అంతా ఇంగ్లీష్ లోను, స్థానిక భాషలోను ఉంటుంది.
Pages: -1- -2- 3 -4- News Posted: 18 November, 2009
|