మన గోవులకు అవమానం! ఇది ఇలా ఉండగా, పార్లమెంట్ లో సభ్యులు గట్టిగా కేకలు వేస్తుండడం విని ఉంటాం. వారు పరస్పరం తోసుకోవడం చూసి ఉంటాం. కాని మన ఎంపిల మెదళ్ళు ఎలా పని చేస్తాయో జీరో అవర్ లోను, ప్రైవేట్ సభ్యుల బిల్లుల విషయంలోను తెలుసుకోవచ్చు. శుక్రవారం సభలో పరిశీలన కోసం అటువంటివి 39 బిల్లులను లిస్టులో ఉంచారు. అంటే వినియోగదారుని ప్రయోజనాల నుంచి రాజ్యాంగ ప్రయోజనాల వరకు వారు అమిత శ్రద్ధ వహిస్తున్నారని విదితమవుతుంది.
బిజెపి సభ్యుడే అయిన రాజన్ సుశాంత్ బిల్లును ప్రవేశపెట్టలేదు. కాని రాముడు, కృష్ణుడు, విక్రమాదిత్యుడు స్థాయిలో ఆదర్శప్రాయులైన రాజకీయ నేతలకు ఐఐపిలు తర్ఫీదు ఇవ్వాలని సుశాంత్ కోరడం బట్టి ఈ విషయమై ఆయన ఎంత సీరియస్ గా ఉన్నారో విదితం అవుతుంది. అయితే, ఈ సందర్భంలో ఐఐపి అంటే పారిశ్రామిక ఉత్పత్తి సూచి కాదు. ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పాలిటిక్స్ (భారతీయ రాజకీయ విద్యా సంస్థ)లు అని ఆయన ఆంతర్యంగా మనం అర్థం చేసుకోవాలి.
ఐఐఎంలు ఉత్తమ మేనేజర్లను ఉత్పత్తి చేస్తుండగా, ఇతర విద్యా సంస్థలు సమర్థులైన అధికారులను తయారు చేస్తుండగా నాణ్యమైన రాజకీయ వేత్తల తయారీకి అటువంటి సంస్థలు ఎందుకు ఉండరాదని ఆయన ప్రశ్నించారు.
మరి ఆయన పార్టీ అగ్ర నేత ఎల్.కె. అద్వానీ ఈ విషయమై ఏమి అనుకుంటున్నారో తెలియదు. కాని దేశంలో 'మేధావులైన' రాజకీయ నేతలు లేరని సుశాంత్ వాపోయారు. యుగాల నాటి ఋషుల ఆశ్రమాలు వంటి సంస్థలలో సుశిక్షితులైన మేలిమి రాజకీయ నేతలు లేనప్పుడు దేశం ఎలా 'రామ రాజ్యం' కాగలదని ఆయన ప్రశ్నించారు.
Pages: -1- 2 -3- -4- News Posted: 5 December, 2009
|