మన గోవులకు అవమానం! కేంద్ర మానవ వనరుల అభివృద్ధి (హెచ్ఆర్ డి) శాఖ మంత్రి కపిల్ సిబల్ ను ఇదే ప్రశ్న అడిగి ఉంటే ఈ పొదుపు చర్యల సంవత్సరంలో ఐఐపిలపై వాగ్దానం చేయడానికి తమ వద్ద నిధులు లేవవి సమాధానం ఇచ్చి ఉండేవారు.
భారతీయ గోవులకు జరుగుతున్న అవమానం పట్ల కుంగిపోయిన మేఘ్వాల్ ముఖ్యంగా క్రియాశీలక సభ్యుడే. దేశీయ కార్మికుల వేతనాల నిర్థారణను కోరుతూ ఆయన ఒక బిల్లును ప్రవేశపెట్టారు. వర్షపు నీటిని నిల్వ చేసే ఏర్పాటు ప్రతి ఇంటికి తప్పనిసరి చేయాలని సూచిస్తూ ఆయన మరొక బిల్లును ప్రతిపాదించారు.
కాగా, బిజూ జనతా దళ్ (బిజెడి) సభ్యుడు బైజయంత్ పాండా ఆశయాలు భిన్నమైనవి. ఆయన మూడు బిల్లులు ప్రవేశపెట్టారు. వాటిలో ఒకటి అవాంఛిత టెలిఫోన్ కాల్స్ కు సంబంధించినది కాగా, మరొకటి నక్సలైట్ బాధితుల పునరావాసాన్ని కోరుతున్నది. మూడవది ఇద్దరు పిల్లల సూత్రంపై ప్రచారానికి శాసనబద్ధమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నది. ఈ బిల్లులు ఏ రాజకీయ ముద్రా లేనివే.
కాగా, మన ఎంపిలు ఒక్కొక్కసారి తమ పార్టీలను ఇరకాటంలోకి నెట్టే బిల్లులను తీసుకువస్తుంటారు. రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్ జెడి) సభ్యుడు రఘువంశ్ ప్రసాద్ సింగ్ ఒకసారి అవినీతిపరుల పేర్లతో జాతీయ డైరెక్టరీని వెలువరించాలని కోరుతూ ఒక బిల్లును ప్రవేశపెట్టారు. ఆతరువాత కొద్ది కాలానికే మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కళంకిత ఆర్ జెడి నాయకులను మంత్రివర్గంలో చేర్చుకున్నందుకు ప్రతిపక్షాల నుంచి విమర్శలను ఎదుర్కొన్నది.
Pages: -1- -2- 3 -4- News Posted: 5 December, 2009
|