మన గోవులకు అవమానం! సభా కార్యక్రమాలకు అవరోధం కలిగించే సభ్యులకు దిన భత్యం (డిఎ) సౌకర్యాన్ని రద్దు చేయాలని, మరీ తీవ్ర పరిస్థితులలో వారి సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలని కోరుతూ కాంగ్రెస్ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఒక బిల్లును ప్రవేశపెట్టారు. లోక్ సభ మాజీ స్పీకర్ సోమనాథ్ చటర్జీ లోగడ ఇటువంటి ప్రతిపాదన చేసినప్పుడు అన్ని పార్టీలూ అభ్యంతరం వ్యక్తం చేశాయి.
రాజ్యాంగ సవరణ కోసం చాలా మంది ఎంపిలు బిల్లులు తీసుకువస్తూనే ఉంటారు. శుక్రవారం కూడా తొమ్మిది మంది సభ్యులు రాజ్యాంగ సవరణ బిల్లులు తీసుకువచ్చారు. అయితే, రాజ్యాంగాన్ని సవరించాలని కోరే ఏ బిల్లునైనా ప్రైవేట్ సభ్యుల బిల్లులు,తీర్మానాల కమిటీ పరిశీలించవలసి ఉంటుంది. ప్రైవేట్ సభ్యులు తీసుకువచ్చే బిల్లులను బ్యాలట్ల ద్వారా ఎంపిక చేస్తారు. అలా ఎంపిక చేసిన బిల్లులను వాటి ప్రాముఖ్యాన్ని నిర్థారించడానికి, వాటిని ప్రవేశపెట్టి చర్చించడానికి గాను 'ఎ', 'బి' కింద వర్గీకరిస్తారు.
1952 నుంచి ఇప్పటి వరకు ప్రైవేట్ సభ్యులు ప్రవేశపెట్టిన బిల్లులలో 14 బిల్లులకు మాత్రమే ఆమోద ముద్ర లభించింది. వాటిలో తొమ్మిదింటిని లోక్ సభలోను, ఐదింటిని రాజ్యసభలోను ప్రవేశపెట్టారు.
Pages: -1- -2- -3- 4 News Posted: 5 December, 2009
|