పాక్ క్రికెటర్ల 'వెల'వెల ఆలాగే ఇండియా ఆటగాడు మహమ్మద్ కైప్ ను పంజాబ్ ఎలెవన్ కైవశం చేసుకుంది. ఇంగ్లాండ్ ఆటగాడు మోర్గాన్ ను 222,000 డాలర్లకు బంగళూరు రాయల్ ఛాలంజర్స్ దక్కించుకుంది. అండర్ 19 కి చెందిన ఆటగాళ్లను మాత్రం వేలంలో చేర్చకుండా బేస్ ధరలు నిర్ణయించారు. అండర్ -19 ఆటగాడు అశోక్ మినారియాను బంగళూరు, హర్మీత్ సింగ్ ను డెక్కన్ ఛార్జర్స్, హర్షా పాటిల్ ను ముంబయి ఇండియన్స్ లు బేస్ ధర 8 లక్షలకు కొనుగోలు చేసారు.
అయితే పాక్ ఆటగాడు సోహాలి తన్వర్, కమరన్ అక్మల్, ఇమ్రాన్ నజీర్ లను ఈ వేలంలో కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ముందుకు రాలేదు. ఆస్ట్రేలియాకు చెందిన పిల్ హగ్స్, బ్రాడ్ హడ్డిన్, ఇంగ్లాండ్ కు చెందిన గ్రేమీ స్వన్ ను జోనాధన్ ను , వెస్టీండీస్ కు చెందిన వావెల్ హిండ్స్, శర్వాణ్, గంగాలను కొనుగోలు చేసేందుకు అసలు బిడ్ లు దాఖలు కాలేదు. అలాగే శ్రీలంక ఆటగాళ్లు ఉపుల్ తరంగ, నువాన్ కులశేఖరలతో పాటుగా బంగ్లాదేశ్ జట్టు కెప్టెన్ షాకిబ్ హసన్ లు ఫ్రాంచీజీలను ఆకర్షించలేకపోవడంతో బిడ్ లు దాఖలు కాక వేలంలో మిగిలిపోయారు.
Pages: -1- 2 News Posted: 19 January, 2010
|