షాక్ తిన్న పాక్ క్రికెటర్లు కాగా కోట్లు పోసి కొన్న తరువాత ఆటగాడు అందుబాటులో ఉండకపోతే ఉపయోగం ఏమిటనీ ఫ్రాంచైజీ యజమానులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు పాక్ ప్రభుత్వం అనుమతి ఇచ్చి ఉండవచ్చు. తీరా మ్యాచ్ లు మొదలైన తరువాత వారు అందుబాటులో లేకపోతే పరిస్థితి ఏమిటని ఆలోచించే పాక్ క్రికెటర్ల పట్ల కొంచెం స్థిమితంగా వ్యవహరించాలనుకున్నామని ప్రీతీ జింటా, శిల్పా శెట్టి స్పష్టం చేశారు. ఎవరైతే టోర్నమెంటుకు అందుబాటులో ఉంటారనుకున్నామో వారికే ప్రాధాన్యత ఇచ్చామని, పాక్ క్రికెటర్లు వద్దని తాము నిర్ణయించుకోలేదని వారు వివరించారు.
అంతేకాక క్రికెట్ క్రీడా పండితులు గతంలోనే ఈ పరిణామాన్ని అంచనా వేశారు. ఫ్రాంచైజీలు బహుశా పాక్ క్రికెటర్ల పట్ల ఆసక్తి చూపించకపోవచ్చని, ఎందుకంటే వారిని 2008 ఐపిఎల్ ప్రారంభ టోర్నీ వేలంలో ఎంపిక చేసకున్న ఫ్రాంచైజీలు తరువాత వారిలో కొంతమంది అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు పడ్డారని వివరించారు. కోట్లు పోసి కొన్న తరువాత ఆ క్రికెటర్ అందుబాటులో లేకపోతే ఆ స్థానం కూడా ఖాళీగా ఉండిపోతుందని వివరించారు. దీనిపై ఐపిఎల్ చీఫ్ లలిత్ మోడి మాట్లాడుతూ ఆటగాళ్ళను ఎంపిక చేసుకునే పూర్తి స్వేచ్ఛ ఫ్రాంచైజీలకే ఉందని, దానిలో ఐపిఎల్ ప్రమేయం ఉండదని చెప్పారు. పాక్ క్రికెటర్లకు సంబంధించి వారు అందుబాటు విషయమే తీవ్ర సమస్యగా మారిందని అన్నారు. జట్టుకు ఉండే వ్యూహం ప్రకారం క్రీడాకారులను ఫ్రాంచైజీలు ఎంపిక చేసుకుంటాయని అయన వివరించారు.
Pages: -1- 2 News Posted: 19 January, 2010
|