కూడబలుక్కునే 'పాడలేదు' ఈ సీజన్ ఐపిఎల్ మ్యాచ్ ల్లో ఎక్కువ శాతం ముంబయిలోనే జరుగుతున్న అంశాన్ని కూడా ఫ్రాంచైజీలు పరిగణనలోనికి తీసుకున్నారు. ముంబయి మ్యాచ్ ల్లో పాకిస్తాన్ క్రికెటర్లు ఆడితే రాజ్ థాకరే నాయకత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్), శివ సేన దాడులు చేయవచ్చన్న భయం కూడా ఫ్రాంచైజీలకు ఉంది. అస్ట్రేలియాలో భారతీయుల మీద జరుగుతున్న దాడులకు ప్రతీకారంగా ఆస్ట్రేలియా క్రికెటర్లను మహారాష్ట్రలో ఆడనీయబోమని శివ సేన హెచ్చరించిన విషయాన్ని ఫ్రాంచైజీ యజమానులు ప్రస్తావిస్తున్నారు. ఇప్పటికే ఆస్ట్రేలియా ఆటగాళ్ళు ఈ విషయంమై తమను ప్రశ్నిస్తున్నారని, వారు భద్రతపై అనుమానాలు వ్యక్తం చేశారని వీరు చెబుతున్నారు.
ఆటగాళ్ల భద్రత ఫ్రాంచైజీ యజమానులను బాగా కలవర పెడుతున్న విషయంగా మారింది. ఐపిఎల్ కు సంబంధించినంత వరకూ ఆటగాళ్ళ భద్రతతో బిసిసిఐకి ఎలాంటి బాధ్యత లేదు. ముంబయిలో పాకిస్తాన్ క్రికెటర్లకు భద్రతను గురించి బోర్డు ప్రభుత్వాన్ని అడిగింది. కాని ప్రభుత్వం నుంచి వచ్చిన సమాధానం బోర్డుకు సంతృప్తి కలిగించలేదు. ముంబయి దాడులు జరిగి సంవత్సరం అయిన నేపథ్యంలో పాక్ క్రికెటర్ల భద్రతపై అనుమానాలు ఉన్నాయని ఫ్రాంచైజీలు స్పష్టంగా చెబుతున్నారు.
అయినా వేలం జాబితాలో పాక్ ఆటగాళ్ళను చేర్చి బిడ్ వేయమనే బోర్డు సలహా ఇచ్చింది. వద్దనే సూచన ఏదీ బిసిసిఐ చేయలేదుని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. కానీ ముంబయి విషయంలో హామీలు లేవు. దాంతో ఫ్రాంచైజీలు అందరూ ఒక మాట అనుకునే పాక్ క్రికెటర్లను పక్కన పెట్టారని ఆయన వివరించారు. అంతేకాక 2008 ఐపిఎల్ టోర్నీలో పాక్ ఆటగాళ్ళ స్పష్టమైన ముద్ర కూడా ఏమీ లేదని చెప్పారు. డక్కన్ ఛార్జర్స్ తో అఫ్రిదీకి తత్సంబంధాలు లేవని, ఆసిఫ్ ప్రతిభ ఏదీ ఢిల్లీ డేర్ డెవిల్స్ లాభించలేదని వివరించారు. ఇలాంటి చాలా కారణాల వల్లే పాక్ క్రికెటర్లను ఫ్రాంచైజీలు బహిష్కరించారని చెబుతున్నారు.
Pages: -1- 2 News Posted: 21 January, 2010
|