కైఫ్ కు లైఫ్ దొరికేనా? ఇటీవల జరిగిన రంజీ టోర్నీలో ముంబయితో జరిగిన పోరులో మనీష్ పాండే తన సొంత జట్టైన కర్ణాటక కు ఒంటి చేత్తే విజయాన్ని తెచ్చిపెట్టిన ఘటన కూడా సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించింది. దీంతో మనీష్ పేరును కూడా సెలక్టర్లు సీరియస్ గా పరిశీలిస్తున్నారు. ఈ కొత్త కుర్రాళ్లు కాకుండా అనుభవం ఉన్న ఆటగాళ్ల వైపు సెలక్షన్ బోర్డు దృష్టి మళ్లితే ఉత్తరప్రదేశ్ కు చెందిన మహ్మద్ కైఫ్ కు కూడా ఛాన్స్ దక్కే అవకాశాలు లేకపోలేదు. ఇటీవల దులీప్ ట్రోఫీలో అత్యద్భుతంగా రాణించడాన్ని సెలెక్టర్లు పరిగణలోకి తీసుకుండే మిడిల్ ఆర్డర్ లో కైఫ్ కు ప్లేస్ ఖాయంగా క్రికెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆలాగే భారత ఎ జట్టులో ఆడుతున్న అజింఖ్య రహణే, చేతేశ్వర పూజారల పేర్లను కూడా సెలక్షన్ బోర్డు పరిశీలించే అవకాశాలు కూడా లేకపోలేదని తెలుస్తోంది.
అలాగే బౌలింగ్ లో కూడా మరో ఆటగాడిని వెతుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో పేస్ బౌలర్ శ్రీశాంత్ కి కూడా గాయమైంది. దీంతో దక్షిణాఫ్రికాతో జరుగే సిరీస్ కి శ్రీశాంత్ కూడా డౌటే. దీంతో ఆ స్ధానాన్ని కూడా భర్తీ చేసేందుకు సెలక్టర్లు కసరత్తు చేస్తున్నారు. రంజీ మ్యాచ్ లలో అత్యధికంగా వికెట్లు తీసిన కర్ణాటక యంగ్ పేస్ బౌలర్ అభిమన్యు పేరును బోర్డు పరిశీలిస్తోంది. శ్రీశాంత్ స్థానాన్ని అభిమన్యుతో బర్తీ చేసే అవకాశం ఉంది.
ఇక స్పిన్ బౌలింగ్ లో హర్భజన్ సింగ్ కూడా ఆశించిన స్థాయిలో రాణించడం లేదని బోర్డు వర్గాలు భావిస్తున్నాయి. భజ్జీకి తోడుగా స్పిన్నర్లు అమిత్ మిశ్రా, ప్రజ్ఞాన్ ఓజాలను ఒకరు కాకపోతే మరొకరు రీతిలో మార్పులు చేస్తునే ఉన్నారు. రంజీ టైటీల్ ను ముంబయి జట్టు కైవశం చేసుకున్నందున గత కొంతకాలంగా వస్తున్న సంప్రదాయం ప్రకారం అక్కడి వారికి అవకాశం కల్పించాలన్న ఒత్తిడి సెలక్టర్లపై ఉండనే ఉంది. బౌలింగ్ తో పాటుగా బ్యాటింగ్ లో కూడా రాణిస్తున్న రమేష్ పవార్ పేరు కూడా పరిశీలకుల జాబితా చోటు దక్కించుకున్నట్లు తెలుస్తోంది.
Pages: -1- 2 News Posted: 27 January, 2010
|