సైన్సు రంగంలోకి 'మహిళ' 'టాస్క్ ఫోర్స్ సూచించిన సిఫార్సులు సుశిక్షితులైన, ప్రతిభావంతులైన మహిళలు పరిశోధన రంగంలో కొనసాగడానికి కీలకం కాగలవు' అని సీనియర్ సైంటిస్టు ఒకరు చెప్పారు. ప్రస్తుతం సైన్సు సంస్థల్లో ఉన్న అలిఖిత నిబంధనలు అమలు కారణంగా మహిళా పోస్ట్ గ్రాడ్యుయేట్లు, తుదకు డాక్టరేట్లు కూడా పురోగతికి అవకాశం ఉన్న సైంటిఫిక్ కెరీర్ లకు వివిధ కారణాలతో స్వస్తి చెపుతున్నారని సర్వేలు తెలియజేస్తున్నాయి. సైన్సు సబ్జెక్టులలోని పిహెచ్ డి స్కాలర్లలో 37 శాతం మంది మహిళలు కాగా, వైజ్ఞానిక సంస్థలలో మహిళా పరిశోధకులు దాదాపు 20 శాతం మంది ఉన్నారని రెండేళ్లకు పైగా క్రితం నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడైంది.
'జీవిత భాగస్వామి (మహిళ) నియామకాలకు సంబంధించినవి లేదా ఉద్యోగాలకు ఇంటర్వ్యూలలో వ్యక్తిగత ప్రశ్నలను నిరోధించేందుకు నైతిక ప్రవర్తన నియమావళి రూపకల్పన వంటి మా ప్రతిపాదనలు కొన్నిటికి ప్రత్యేకంగా నిధులు సమకూర్చవలసిన అవసరం లేదు. దృక్పథంలో మార్పు మాత్రమే కావాలి' అని టాస్క్ ఫోర్స్ సభ్యులు ఒకరు చెప్పారు. ఈ సిఫార్సులను ఆమోదించినట్లయితే, వీటిని రోదసి, అణు ఇంధన శక్తి, సైన్స్, టెక్నాలజీ, వైజ్ఞానిక, పారిశ్రామిక పరిశోధన, వైద్య పరిశోధన, వ్యవసాయ పరిశోధన వంటి శాఖల పరిధిలోని సంస్థలు అమలు చేయవలసి ఉంటుంది.
సైన్స్, టెక్నాలజీ శాఖ అధికారి ఒకరి సమాచారం ప్రకారం, ఆ శాఖ అజమాయిషీలోని పలు సంస్థలు క్రెష్ లు ఏర్పాటు చేస్తున్నాయి. భారత జాతీయ సైన్సెస్ అకాడమీ (ఐఎన్ఎఎస్)లో అసోసియేట్లుగా ఉన్న యువ మహిళా పరిశోధకులకు ఐదేళ్లకు రూ. 10 లక్షల మేరకు గ్రాంట్లను సమకూర్చాలని ఇంతకుముందు చేసిన సిఫార్సును కూడా సైన్స్ సంస్థ అమలు పరుస్తున్నది. అయితే, మహిళలకు సానుకూల పని వేళలను నిర్దేశించాలన్న లోగడ ప్రతిపాదనను ఇప్పటికీ అమలు జరపలేదు. 'కాని దానికి బదులుగా తల్లులకు రెండేళ్ల శిశు పోషణ సెలవు సౌకర్యాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది' అని ఆ అధికారి తెలియజేశారు.
Pages: -1- 2 News Posted: 28 January, 2010
|